గర్బిణుల నియామకాలపై వివాదాస్పద ఉత్తర్వులు.. మహిళా కమీషన్ ఆగ్రహం, ఎస్‌బీఐకి నోటీసులు

Siva Kodati |  
Published : Jan 29, 2022, 10:01 PM IST
గర్బిణుల నియామకాలపై వివాదాస్పద ఉత్తర్వులు.. మహిళా కమీషన్ ఆగ్రహం, ఎస్‌బీఐకి నోటీసులు

సారాంశం

మూడు నెలలు నిండిన గర్భిణులను (pregnant women) సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి (state bank of india) ఢిల్లీ మహిళా కమిషన్ (delhi women commission) నోటీసు జారీ చేసింది

మూడు నెలలు నిండిన గర్భిణులను (pregnant women) సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి (state bank of india) ఢిల్లీ మహిళా కమిషన్ (delhi women commission) నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ (swati maliwal) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమేనని స్వాతి అభిప్రాయపడ్డారు. అది చట్ట విరుద్ధం కూడా అని ఆమె వ్యాఖ్యానించారు. 

చట్ట ప్రకారం కల్పించిన మెటర్నిటీ ప్రయోజనాలపై అది ప్రభావం చూపుతుందని స్వాతి చెప్పారు. మహిళలకు వ్యతిరేకంగా వున్న ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్‌బీఐకి నోటీసు జారీ చేశాం అని ఆమె వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని గర్భంతో ఉన్నారని చేర్చుకోకపోవడం సరికాదన్నారు. తాత్కాలికంగా అన్ ఫిట్ అని చెప్పి.. డెలివరీ అయిన నాలుగు నెలల తర్వాత వారిని చేర్చుకోనున్నట్టు ఎస్బీఐ ఆదేశాలు తెలియజేస్తున్నాయని స్వాతి మలివల్ మండిపడ్డారు. అసలు ఈ నిబంధనలను ఎలా రూపొందించారు? దీని వెనుక అధికారులు ఎవరు వున్నారు? తెలియజేయాలని మహిళా కమిషన్ నోటీసుల్లో ఆదేశించింది. 

కాగా.. నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళా ఉద్యోగులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారు డెలివరీ అయ్యాక.. 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంంది. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. అయితే పదోన్నతులపై వెళ్లే వారికి మాత్రం 2022 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని స్టేట్‌బ్యాంక్ వెల్లడించింది. 

అయితే ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆలిండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌తో (all india state bank employees association) పాటు మహిళా సంఘాలు సైతం ఎస్‌బీఐ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కొత్త నిబంధనను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (nirmala sitharaman) సీపీఐ (cpi) రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వమ్‌ లేఖ రాశారు. విషయం ఢిల్లీ మహిళా కమీషన్ వరకు వెళ్లడంతో .. ఎస్‌బీఐకి నోటీసులు జారీ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !