ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన హైకోర్టు

Published : May 30, 2023, 12:26 PM IST
ఢిల్లీ  లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు  చుక్కెదురు: బెయిల్  తిరస్కరించిన హైకోర్టు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియాకు బెయిల్  ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను  మంగళవారంనాడు  ఢిల్లీ హైకోర్టు   తిరస్కరించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ  కేసులో  మనీష్ సిసోడియా  బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  

మనీష్ సిసోడియాపై  వచ్చిన ఆరోపణలు  చాలా తీవ్రమైనవిగా  హైకోర్టు అభిప్రాయపడింది . దీంతో  మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు  తెలిపింది.మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను  కోర్టు  తిరస్కరించింది.

ఈ కేసులో  సాక్షులను  ప్రభావితం  చేసే అవకాశాలను  తోసిపుచ్చలేమని  కోర్టు  పేర్కొంది. మనీష్ సిసోడియాపై  వచ్చిన ఆరోపణలు  చాలా తీవ్రమైనవిగా  కోర్టు  అభిప్రాయపడింది.  అతను  సాక్షులను ప్రభావితం  చేయగలడని కోర్టు అభిప్రాయపడింది, ఈ సమయంలో   ఆయనకు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని  కోర్టు పేర్కొంది.మనీష్ సిసోడియా  జ్యుడిషీయల్  కస్టడీలో  భాగంగా  తీహార్ జైలులో  ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal