లైంగిక వేధింపులు: మామను చంపి శవాన్ని పిఎస్ కు తెచ్చిన కోడలు

Published : Sep 01, 2019, 11:09 AM IST
లైంగిక వేధింపులు: మామను చంపి శవాన్ని పిఎస్ కు తెచ్చిన కోడలు

సారాంశం

ఓ కోడలు మామను హత్య చేసి, అతని శవాన్ని గోనెసంచీలో వేసుకుని పోలీసు స్టేషన్ కు చేరుకుంది. తనను లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె హత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలోని బాలకోట్ జిల్లాలో జరిగింది.

బెంగళూరు: లైంగికంగా, మానసికంగా తనను వేధించిన మామను ఓ కోడలు చంపేసి, శవాన్ని గోనెసంచిలో వేసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్ కోట జిల్లాలో జరిగింది. అడ్డు వచ్చిన అత్తను ఇనుప రాడ్ తో బలంగా కొట్టింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆ తర్వాత మరణించింది.

ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాగలకోట జిల్లాలోని జమఖండి తాలూకా కెడీ గ్రామానికి చెందిన సిద్ధరామ మల్లేశనవర్ (58), అత్త కళావతి (45) కోడలు గీత మల్లేశ్ నవర్ చేతిలో హత్యకు గురయ్యారు. మామ సిద్ధరామ గత కొన్ని రోజులుగా కోడలు గీతను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు

దాంతో విసుగు చెందిన కోడలు మామతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో కోడలు పక్కనే ఉన్న ఇనుపరాడ్ తో మామ తలపై బలంగా మోదింది. దాంతో తీవ్రంగా గాయపడిన సిద్ధరామ అక్కడికక్కడే కుప్పకూలాడు. అడ్డు వచ్చిన అత్త కళావతిని కూడా కొట్టింది. 

ఆ తర్వాత కోడలు మృతదేహాన్ని గోనెసంచీలో వేసుకుని భర్త గురుపాదతో కలిసి సావళిగి పోలీసు స్టేషన్ కు చేరుకుంది. గీతను, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ