భారత్ లో కరోనా కలకలం.. నిన్న ఒక్కరోజే వెయ్యి మరణాలు

Published : Aug 14, 2020, 11:58 AM IST
భారత్ లో కరోనా కలకలం.. నిన్న ఒక్కరోజే వెయ్యి మరణాలు

సారాంశం

భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 48,040కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595. భారత్‌లో ఇప్పటివరకూ 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకీపెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఊహించని విధంగా పెరిగిపోతుండటం గమనార్హం. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 64,553 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,61,191కి చేరింది. 

భారత్‌ను కరోనా మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 1007 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 48,040కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595. భారత్‌లో ఇప్పటివరకూ 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇదిలా ఉండగా...  ప్రపంచంలోనే వేగవంతమైన కరోనా టెస్ట్‌ కిట్‌ను ప్రముఖ గ్లోబల్‌ బయోటెక్నాలజీ సంస్థ జెన్‌స్క్రిప్ట్ భారత మార్కెట్‌లోకి‌ లాంచ్‌ చేసింది. ఇందుకోసం ప్రేమాస్ లైఫ్ సైన్సెస్‌తో జతకట్టింది. సీ పాస్‌ సార్స్‌ సీవోవీ-2 న్యూట్రలైజేషన్‌ యాంటీబాడీ డిటెక్షన్‌ కిట్‌గా పిలిచే దీనిని సింగపూర్ ఏజెన్సీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నుంచి డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సింగపూర్, డయాగ్నోస్టిక్స్ డెవలప్‌మెంట్ హబ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.

మరోవైపు.. కరోనా పరీక్షలకు వాడే కిట్లలో ఇది ప్రపంచంలోనే మొదటి వేగవంతమైన పరీక్షా కిట్. ఇది ఒక గంటలోపు తటస్థీకరించే ప్రతిరోధకాలను కొలవగలదు. దీనిని జెన్‌స్క్రిప్ట్ బయోటెక్ కార్పొరేషన్‌ తయారుచేస్తుంది. ఇది ప్రస్తుత కొవిడ్‌-19 పరిశోధనలు, సెరో-ప్రాబల్యెన్స్ సర్వే, హెర్డ్‌ ఇమ్యూనిటీపై పరిశోధన, దీర్ఘాయువు తటస్థీకరించే ప్రతిరోధకాలు, టీకా వేయించుకునే అభ్యర్థుల సామర్థ్యాన్ని రక్షించడంలాంటి వాటికి ఊతంగా నిలుస్తుంది. సాంప్రదాయిక లైవ్ వైరస్ పరీక్షా కిట్‌ల మాదిరిగా కాకుండా గ్లోబల్ కమ్యూనిటీ సీపాస్‌ను ఉపయోగించగలదు.

PREV
click me!

Recommended Stories

గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well
డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu