Coronavirus: క‌రోనా థ‌ర్డ్ వేవ్‌.. రోజుకూ 8 ల‌క్ష‌ల కొత్త కేసులు.. !

By Mahesh RajamoniFirst Published Jan 8, 2022, 5:00 PM IST
Highlights

Coronavirus: దేశంలో క‌రోనా పంజా విసురుతోంది. భార‌త్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూసిన త‌ర్వాత క‌రోనా కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. అయితే, క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ఫిబ్ర‌వ‌రిలో పీక్ స్టేజ్‌కు చేరుకుంటుంద‌నీ, రోజువారి కేసులు 8 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ఐఐటీ కాన్పూర్ ప‌రిశోధ‌కులు అంచనా వేస్తున్నారు.
 

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన త‌ర్వాత Coronavirus కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. భార‌త్ లోనూ ప్ర‌స్తుతం క‌రోనా పంజా విసురుతోంది. రోజువారీ కొత్త కేసులు ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా త‌న ప్ర‌భావాన్ని పెంచుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ లో ఇప్ప‌టికే క‌రోనా థ‌ర్డ్ వేవ్ (third wave) ప్రారంభ‌మైంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 థ‌ర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామ‌ని చెబుతున్నారు.  అయితే, క‌రోనా థ‌ర్డ్ వేవ్ పీక్ స్టేజ్ మాత్రం ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌లో ఉంటుంద‌ని ఐఐటీ కాన్పూర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్ర‌స్తుతంCoronavirus కేసుల పెరుగుద‌ల కోవిడ్-19 థ‌ర్డ్ వేవ్ కు సంకేత‌మ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో థర్డ్‌వేవ్‌లో రోజుకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు క‌రోనా కొత్త  కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చ‌రించారు. మ‌రీ ముఖ్యంగా  దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజుకు 30 నుంచి 60వేల వరకు, దేశ రాజ‌ధాని ఢిల్లీలో గరిష్ఠంగా 35వేల నుంచి 70వేల వరకు  రోజు వారీ కేసులు న‌మోద‌వుతాయ‌ని మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు.

గణిత నమూనా (mathematical model) అధ్య‌య‌నం ఆధారంగా ఐఐటీ కాన్పూర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ పై అంచ‌నా వివ‌రాలు వెల్ల‌డించారు. ఆయ‌న ప్ర‌స్తావించిన మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి... క‌రోనా థ‌ర్డ్ వేవ్ (third wave) స‌మ‌యంలో దేశంలో రోజువారీ Coronavirus కేసులు నాలుగు నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌మోదు అవుతాయి. ఇదే స‌మ‌యంలో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో రోజువారీ కేసులు 30 నుంచి 60 వేల వ‌ర‌కు న‌మోద‌వుతాయి. అలాగే, దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతాయి. ఢిల్లీలో గరిష్టంగా 35 నుంచి 70 వేల వ‌ర‌కు రోజువారీ కొత్త కేసులు వెలుగుచూస్తాయి. Coronavirus కేసులు పెరిగితే స్థానిక స్థాయిలోని ఆస్పత్రులలో పడకల కొరత ఏర్పడవచ్చు. Coronavirus సోకిన వారితో పోలిస్తే ఒకటిన్నర లక్షల పడకలు అవసరం కావచ్చు. 

గతంలో దక్షిణాఫ్రికాలో వస్తున్న Coronavirus కేసుల ఆధారంగా భారత్‌లో ఇన్‌ఫెక్షన్‌ వేగాన్ని అంచనా వేసామని  ఐఐటీ కాన్పూర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అన్నారు. అయితే, ప్ర‌స్తుతం దేశంలో పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి లో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మోడల్‌లో గణాంకాలు మారిపోయాయని అన్నారు. దేశంలో Coronavirus సంక్రమణ వ్యాప్తి రేటు దక్షిణాఫ్రికా కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  third wave లో జనవరి మూడవ వారంలో ఢిల్లీ, ముంబ‌యిలో క‌రోనా ప్ర‌భావం గ‌రిష్ట స్థాయికి చేరుతుంద‌ని తెలిపారు.  ఈ సమయంలో ముంబ‌యి కంటే ఢిల్లీలో ఎక్కువ Coronavirus కేసులు వెలుగుచూస్తాయ‌ని తెలిపారు. క‌రోనా కొత్త కేసులు పెరిగితే స్థానిక ఆస్పత్రుల్లో పడకల కొరత ఉండొచ్చన్నారు. పీక్‌ సమయంలో దేశంలో వైరస్‌ సోకిన వారితో పోలిస్తే ఒకటిన్నర లక్షల పడకలు అవసరం కావొచ్చని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ (third wave) ఫిబ్రవరి 1-15 మధ్య పీక్ స్టేజ్ కు వెళ్లే అవకాశం ఉందని ఐఐటీ మద్రాస్ ప‌రిశోధ‌కులు సైతం అంచనా వేశారు. 

click me!