చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

Siva Kodati |  
Published : Sep 05, 2019, 01:07 PM ISTUpdated : Sep 05, 2019, 01:28 PM IST
చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

సారాంశం

చంద్రయాన్-2 మిషన్‌లో కీలక ఘట్టానికి మరో 48 గంటలే సమయం ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 వ్యోమనౌకను ల్యాండ్ చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

చంద్రయాన్-2 మిషన్‌లో కీలక ఘట్టానికి మరో 48 గంటలే సమయం ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 వ్యోమనౌకను ల్యాండ్ చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే కక్ష్యకు సంబంధించిన అన్ని సవాళ్లను చంద్రయాన్-2 అధిగమించిందని ఇస్రో ప్రకటించింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడినప్పటి నుంచి వాటిని దిగువ కక్ష్యకు పంపే సవాలును అధిగమించినట్లు ఇస్రో వెల్లడించింది.

ప్రధాని మోడీతో పాటు చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షేంచేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్ధల నుంచి 16 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు.ఈ జాబితాలో కోదాడకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సైతం స్థానం సంపాదించింది. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్య చంద్రయాన్-2 దిగనుంది.

మరోవైపు రెండోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ల్యాండర్ విక్రమ్ బుధవారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. తెల్లవారుజామున 3.42 గంటల నుంచి 9 సెకన్ల పాటు మండించడంతో ల్యాండర్ 35 కిలోమీటర్లు * 101 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరింది. చంద్రుడి ఉపరితలంపై దిగే దిశగా తన ప్రయాణాన్ని విక్రమ్ ప్రారంభించనుంది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం