బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా: మెయిల్ హ్యాక్ చేసి అశ్లీల మేసేజ్‌లు

Published : Jun 03, 2019, 12:00 PM IST
బెడ్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా: మెయిల్ హ్యాక్ చేసి  అశ్లీల మేసేజ్‌లు

సారాంశం

భార్యకు తెలియకుండా బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌‌గా కెమెరాను అమర్చాడు ఓ భర్త. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బెంగుళూరు:  భార్యకు తెలియకుండా బెడ్‌రూమ్‌లో సీక్రెట్‌‌గా కెమెరాను అమర్చాడు ఓ భర్త. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని  సదాశివనగర్‌లో ఓ డాక్టర్‌ మహారాష్ట్రకు చెందిన రిత్విక్ హెగ్డేను వివాహం చేసుకొంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకు కూడ ఉన్నాడు.  భార్యకు తెలియకుండానే బెడ్‌రూమ్‌లో‌ ‌సీసీటీవీ కెమెరాను అమర్చాడు.  భార్యతో శృంగారాన్ని వీక్షించే ఉద్దేశ్యంతో ఈ కెమెరాను అమర్చాడు. 

అంతేకాదు భార్యకు తెలియకుండానే ఆమె ఈ మెయిల్‌ను హ్యాక్ చేసిన రిత్విక్  ఆమె స్నేహితులకు అశ్లీల మెసేజ్‌లను పంపాడు. ఈ విషయాన్ని పసిగట్టిన భార్య భర్తను ప్రశ్నించింది. దీంతో భార్యపై భర్తతో పాటు అత్తా మామలు  దాడికి పూనుకొన్నారు. ఆమెను ఇంటి నుండి బయటకు పంపారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?