India – Italy: భారతదేశం, ఇటలీ ప్రభుత్వాల మధ్య మైగ్రేషన్, మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేయాలనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇటలీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత 12 నెలల పాటు ఇటలీలో ఉండటానికి వీలు కల్పిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇటాలియన్ పక్షం నాన్-సీజనల్ భారతీయ కార్మికుల కోసం రిజర్వ్ చేసిన కోటాను 12,000 కు పెంచింది. ఈ ఒప్పందం వల్ల భారతీయులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం...
India – Italy: భారత్, ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇటలీ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు అదనంగా ఉండేందుకు అనుమతించింది. ప్రధాని మోడీ ప్రతిపాదనలకు ఇటలీలోని మెలోని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేకురనున్నది. అదే సమయంలో భారతీయ కార్మికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ కోటాను కూడా రిజర్వ్ చేసింది. అలాగే.. స్కెంజెన్ వీసా పొందడానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇటలీ సర్కార్ సహకరిస్తోంది.
భారతదేశం, ఇటలీ ప్రభుత్వాల మధ్య మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేయాలనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఒప్పందం ప్రకారం ఇటలీలో చదువుతున్న విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు ఇటలీలో ఉండొచ్చు. ఇది కాకుండా.. ఇటలీ తన దేశంలో 12,000 నాన్-సీజనల్, 8,000 సీజనల్ భారతీయ కార్మికులను పని చేయడానికి అనుమతించాలని నిర్ణయించింది.
ఈ వలస-ఒప్పందం వల్ల ఇటలీలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను పరిష్కరించడంలో సహాయపడుతుంది. భారతీయ కార్మికులకు విదేశాలలో మెరుగైన ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. ఈ ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.నిజానికి ఇండియా- ఇటలీ మధ్య సంబంధాలను ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి . భారత్‌కు రోమ్‌లో రాయబార కార్యాలయం, మిలన్‌లో కాన్సులేట్ ఉన్నాయి. ఇటలీకి న్యూఢిల్లీలో రాయబార కార్యాలయం ఉంది. ముంబై , కోల్‌కతాలో కాన్సులేట్ జనరల్‌లు ఉన్నాయి . రెండు దేశాల మధ్య పురాతన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి.