మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ సబబే: ముంబై హైకోర్టు

Published : Jun 27, 2019, 04:26 PM IST
మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ సబబే: ముంబై హైకోర్టు

సారాంశం

మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లను మహరాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని ముంబై హైకోర్టు సమర్ధించింది.  

ముంబై: మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లను మహరాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని ముంబై హైకోర్టు సమర్ధించింది.

ఈ రిజర్వేషన్లను  సవాల్ చేస్తూ ముంబై కోర్టులో దాఖలైన  పిటిషన్లపై ముంబై కోర్టు గురువారం నాడు తీర్పును వెలువరించింది.గత ఏడాది  నవంబర్ 30వ తేదీన సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన (ఎస్‌ఈబీసీ) మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లను అమలు  చేస్తూ చట్టం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఎస్‌ఈబీసీలకు  రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.  విద్యా సంస్థల్లో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో  13 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.రిజర్వేషన్ల కోటా 50 శాతానికి దాటకుండా ఉండాలనే నిబంధనకు విరుద్దంగా  ఉందని ఆరోపిస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. 

మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని పిటిషనర్లు వ్యతిరేకించారు.  అయితే  పిటిషనర్ల వాదనతో ముంబై హైకోర్టు తీవ్రంగా విబేధించింది.  మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న  నిర్ణయాన్ని  సమర్ధించింది.

మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అనుకూలంగా  ముంబై కోర్టు తీర్పు వెలువడడం ఫడ్నవీస్  సర్కార్‌కు అనుకూంగా ఉండే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu