తమిళనాడు: బాణాసంచా వ్యాన్‌లో పేలుడు, ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Sep 30, 2019, 10:57 AM IST
తమిళనాడు: బాణాసంచా వ్యాన్‌లో పేలుడు, ఇద్దరి మృతి

సారాంశం

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాలో బాణాసంచాతో వెళుతున్న వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లాలో బాణాసంచాతో వెళుతున్న వ్యాన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపించడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదేరకమైన ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడులో ఓ బాణాసంచా కార్మాగారంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలవ్వగా.. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!