తండ్రి తనపై అత్యాచారం చేయడాన్ని వీడియో తీసిన కూతురు.. సోషల్ మీడియాలో షేర్ చేసి..

Published : May 07, 2022, 08:56 AM ISTUpdated : May 07, 2022, 08:57 AM IST
తండ్రి తనపై అత్యాచారం చేయడాన్ని వీడియో తీసిన కూతురు.. సోషల్ మీడియాలో షేర్ చేసి..

సారాంశం

బీహార్‌లోని సమస్తిపూర్‌లో 18 ఏళ్ల బాలిక తన తండ్రి తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె అత్యాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బీహార్‌ : Biharలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కూతురిపై molestation చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన viralగా మారింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో 50 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

నిందితుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, సమస్తిపూర్‌లోని రోసెరాలో నివాసం ఉంటున్నాడు. తన తండ్రి తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అతని 18 ఏళ్ల కూతురు ఆరోపించింది. అంతేకాదు తండ్రి సిగ్గుమాలిన పనిని పట్టించడానికి ఆమె తన తండ్రిని బహిర్గతం చేయడానికి సీక్రెట్ కెమెరాతో అత్యాచారాన్ని షూట్ చేసింది. ఆ తరువాత తనకు న్యాయం చేయాలంటూ కూతురు తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వీడియో వైరల్ కావడంతో, కుమార్తె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. నిందితుడైన తండ్రిని అరెస్టు చేసినట్లు రోసెరా సబ్‌డివిజన్ డీఎస్పీ సహియార్ అక్తర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోలో బాధితురాలిపై దాడి చేస్తున్నట్లు కనిపించిన వ్యక్తి..  తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఇతర నిందితులను స్టేట్‌మెంట్ ఆధారంగా నిర్ధారిస్తున్నారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు... అని DSP సహియార్ అక్తర్ తెలిపారు.

తండ్రిని విచారించిన పోలీసులు ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెబితే.. ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అంతేకాదు ఈ సంఘటనపై మౌనంగా ఉండాలని బాదితురాలి మామ..(తల్లి సోదరుడు)ఆమెను ఒత్తిడి చేసేవాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, రెండున్నరేళ్ల సొంత కూతురిని sexually abuses చేసిన ఓ వ్యక్తికి Thiruvananthapuramలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు తో పాటు.. రూ.50,000 జరిమానా విధించింది. ఈ దారుణ ఘటన ఫిబ్రవరి 2018లో జరిగింది. ఈ కేసులో ఇప్పుడు న్యాయస్థానం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెడితే.. నిందితుడు తన భార్య, బిడ్డలు, అత్తమామలతో కలిసి ఉండేవాడు. రాత్రివేళ భార్య, కూతురు, నిందితుడు ఒకే దగ్గర పడుకునేవారు. కాగా చిన్నారి.. Urination సమయంలో తరచుగా ఏడుస్తూ.. నొప్పితో బాధపడుతుండటం తల్లి గమనించింది. దీంతో ఆమెకు అనుమానం పెరిగింది. చిన్నారిని పరీక్షించగా.. చిన్నారి Private partsపై గాయాలు ఉన్నట్లు తేలింది. 

కాగా, సదరు కీచక తండ్రి ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ.. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. అంతేకాదు తన బిడ్డో, కాదో తేల్చుకోవడానికి అతను DNA పరీక్ష చేయించాలంటూ పట్టుబట్టాడు. దీంతో ఆమెకు భర్త మీద అనుమానం వచ్చింది. ఇది అతని దుర్మార్గమైన చర్యే అయి ఉంటుందనుకుంది. ఓ రోజు రాత్రి తన భర్త బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడడం చూసి షాక్‌కు గురైంది. 

వెంటనే ఆమె అరుపులు, కేకలు వేస్తూ.. అందర్నీ లేపడానికి ప్రయత్నించింది. దీంతో ఆ భర్త చంపేస్తానని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో పదే పదే లైంగిక వేధింపులకు గురికావడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యుడు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో  రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తీర్పును ప్రకటించేటప్పుడు, నిందితుడు తన సొంత బిడ్డపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. కాబట్టి అతనికి ఎలాంటి క్షమకూ అర్హుడు కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి 13 మంది సాక్షులను విచారించిన కోర్టు 17 డాక్యుమెంట్లను విచారించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌ఎస్‌ విజయ్‌మోహన్‌ హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?