Ayodhhya Temple : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మారింది ...ఏంటో తెలుసా?

By Arun Kumar P  |  First Published Dec 28, 2023, 12:10 PM IST

రామాలయం నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రాాబోయే రోజుల్లో అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం వుండటంతో అత్యాధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఏర్పాటుచేసారు. 


అయోధ్య : భారతదేశంలోని మెజారిటీ ప్రజల కల అతి త్వరలో నెరవేరబోతోంది. హిందువులు దైవంగా పూజించే రాముడి జన్మస్థలం అయోధ్యలో ఎట్టకేలకు భవ్యమందిరం వెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, లక్షలాది భక్తుల మధ్య అట్టహాసంగా అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. దీంతో అయోధ్యలోనే కాదు యావత్ దేశంలో రామనామస్మరణ మారుమోగనుంది.  

రామమందిరం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైన నేపథ్యంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ కు 'అయోధ్య ధామ్' గా నామకరణం చేసింది. రైల్వే  స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను యోగి సర్కార్ రైల్వే శాఖ ముందుంచింది... దానికి రైల్వే అధికారుల అంగీకారం లభించడంతో 'అయోధ్య ధామ్' పేరు ఖరారయ్యింది. 

Latest Videos

రామయ్యను దర్శించుకోవాలనే భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుండి అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ కు రైళ్ళు నడపనున్నారు. అయోధ్య ఆలయం పూర్తయితే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది... ఇది ముందుగానే గ్రహించిన రైల్వే అత్యుత్తమ సౌకర్యాలతో కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించింది. ఈ  రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

Also Read  Ayodhya Temple : హైదరబాద్ ద్వారాలు దాటితేనే అయోధ్య రామయ్య దర్శనం...

చారిత్రక నేపథ్యం కలిగిన అయోధ్యలో నిర్మించిన ఆలయానికి నిత్యం దేశవిదేశాల నుండి పర్యాటకులు తరలివచ్చే అవకాశాలున్నాయి. దీంతో వారికి సౌకర్యవంతంగా వుండేలా,  దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అయోధ్య రామాలయం కోసం ఉపయోగించిన రాళ్లనే ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉపయోగించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా బన్సీ పహర్ పూర్ నుండే రామాలయం, రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. ఇలా కొత్తగా నిర్మించిన భవనం త్వరలోనే అందుబాటలోకి రానుంది. 

ఒకేరోజు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ తో పాటు  విమానాశ్రయాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే స్టేషన్ మాదిరిగానే విమానాశ్రయానికి కూడా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ గా నామకరణం చేసారు. ఇప్పటికే ఈ విమనాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. దీంతో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. 


 

click me!