వేణువు ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి.. బీజేపీ ఎమ్మెల్యే

By telugu teamFirst Published Aug 28, 2019, 10:41 AM IST
Highlights

అసోం రాష్ట్రం సిల్చార్ పట్టణంలో బారక్ వ్యాలీలో జరిగిన సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న దిలీప్ కుమార్ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతం, నృత్యం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు.  అంతవరకూ బాగానే ఉంది. కానీ శ్రీ కృష్ణుడు వేణుగానానికి ఆవులు పరవశించిపోయి అధికంగా పాలు ఇస్తాయనీ..ఇది శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని పేర్కొన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ముందుంటారు. ఇప్పటికే పలువరు నేతలు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కోగా తాజాగా... మరో నేత ఇలా బుక్కయ్యారు. వేణువు ఊదితే ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయంటూ అస్సాం  బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ పేర్కొన్నారు. దీనికి శాస్త్రియంగా ఆధారం ఉందంటూ ఆయన చెప్పడం విశేషం.

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వేణువు (ఫ్లూటు) వాయించట వల్లనే గోకులంలో ఆవులు ఎక్కువ పాలిచ్చాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణుడు వేణుగానంతో పవశించిపోయిన గోమాతలు అత్యధికంగా పాలిచ్చాయని తెలిపారు.  అసోం రాష్ట్రం సిల్చార్ పట్టణంలో బారక్ వ్యాలీలో జరిగిన సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న దిలీప్ కుమార్ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతం, నృత్యం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు.  అంతవరకూ బాగానే ఉంది. కానీ శ్రీ కృష్ణుడు వేణుగానానికి ఆవులు పరవశించిపోయి అధికంగా పాలు ఇస్తాయనీ..ఇది శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని పేర్కొన్నారు.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలో వేణువు గానం చేస్తే ఆ గానం విన్న  ఆవులు అధికంగా పాలు ఇచ్చాయని తేలిందని దిలీప్ కుమార్ చెప్పారు. విదేశీ ఆవుల కంటే దేశీయ ఆవులు  నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు ఇస్తాయని..ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేము జరుగుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారని అన్నారు.

విదేశీ ఆవుల కంటే దేశీయ ఆవు పాలతో తయారు చేసిన  చీజ్, బట్టర్ రుచికరంగా ఉంటుందన్నారు. మన భారత దేశ ఆవుల్ని అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ లోకి స్మగ్లింగ్ చేస్తున్నారని, దీన్ని నివారించాలని దీని కోసం ప్రజలంతా బాధ్యత తీసుకోవాలని కోరారు.

click me!