Jammu & Kashmir Encounter: కెరాన్ సెక్టార్‌లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత .. ముగ్గురు టెర్ర‌రిస్టుల‌ హ‌తం

By Rajesh KFirst Published May 27, 2022, 2:56 AM IST
Highlights

Jammu & Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. భ‌ద్ర‌తా బలాగాలు ఉగ్ర‌మూక‌ల‌ను కాల్చిపారేస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని ఫార్వార్డింగ్ ప్రాంతాలలో భద్ర‌త బలగాలు రంగంలోకి దిగాయి. దేశంలోకి చొర‌బ‌డిన ఉగ్ర‌వాదుల‌పై భారత సైన్యం గురువారం ఎన్ కౌంట‌ర్ చేసింది. 
 

Jammu & Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. భ‌ద్ర‌తా బలాగాలు ఉగ్ర‌మూక‌ల‌ను కాల్చిపారేస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని ఫార్వార్డింగ్ ప్రాంతాలలో భద్ర‌త బలగాలు రంగంలోకి దిగాయి. దేశంలోకి చొర‌బ‌డిన ఉగ్ర‌వాదుల‌పై భారత సైన్యం గురువారం ఎన్ కౌంట‌ర్ చేసింది. 

ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.కెరాన్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో చొరబాటు దారుల‌ ప్రయత్నాన్ని భారత సైన్యం విఫలం చేసింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో  ముగ్గురు ఉగ్రవాదులు చ‌నిపోయారు. సంఘ‌ట‌న స్థలంలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు, మూడు ఏకే రైఫిళ్లు, ఒక పిస్టల్, ఆరు గ్రెనేడ్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్టు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. 

అలాగే.. గురువారం ఉద‌యం జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ముగ్గురూ భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. వారి ప్ర‌య‌త్నం విఫలమైంది. అదేస‌మయంలో ఎన్‌కౌంటర్‌లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒక పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.  హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే, ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో సైన్యంలో పనిచేస్తున్న ఒక పోర్టర్ కూడా మరణించాడు.
  
మే 26, 2022న కెరాన్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఏరియాల్లో చొరబాటు దారుల‌ ప్రయత్నాన్ని సైన్యం విఫలం చేసిందని రక్షణ ప్రతినిధి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
 

నిఘా వ‌ర్గాల స‌మాచారం ఆధారంగా పోలీసులతో పాటు పలు ఏజెన్సీలు సంయుక్త  ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్ర‌త బల‌గాలు తెలిపాయి. మే 26న తెల్లవారుజామున 4.45 గంటలకు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి, దీని ఫలితంగా భారీ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికార ప్రతినిధి తెలిపారు.  

'జమ్మూ కాశ్మీర్‌కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడమే గత మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్ అధికారిక విధానమని ప్రతినిధి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ (PoJK)లో తీవ్రవాద కార్య‌క‌ల‌పాలు పెరిగిన‌ట్టు తెలిపారు.  స్థానిక ప్రజల శాంతి, శ్రేయస్సు, ఆసన్న అమర్‌నాథ్ యాత్రకు విఘాతం కలిగించడ‌మే వారి ప్ర‌ధాన‌ ఉద్దేశ్యమ‌ని ప్రతినిధి చెప్పారు.

click me!