పురుషుల అంగం సైజు: సినీ నటి దియా మీర్జా వార్నింగ్

Published : Mar 27, 2021, 08:25 AM IST
పురుషుల అంగం సైజు: సినీ నటి దియా మీర్జా వార్నింగ్

సారాంశం

ఓ వార్తాకథనాన్ని షేర్ చేస్తూ సినీ నటి దియా మీర్జా వాతావరణ కాలుష్యం తెచ్చి పెట్టే ముప్పుపై ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. దియా మీర్జా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్: సినీ నటి దియా మీర్జా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఓ న్యూస్ ఆర్టికల్ ను షేర్ చేస్తూ దియా మీర్జా పురుషులకు ఓ హెచ్చరిక చేశారు. కాలుష్యం వల్ల పురుషుల అంగం పరిమాణం తగ్గిపోతోందని స్కై న్యూస్ లో ఓ ఆర్టికల్ వచ్చింది. 

ఆ వార్తాకథనాన్ని దియా మీర్జా షేర్ చేస్తూ... వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా తీవ్రంగా పరిగణనలోకి తీసకుంటుందని బావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాధిపై కూడా ఆమె నిరుడు తీవ్రంగా స్పందించారు. పర్యావరణం - మనుషుల మధ్య పెరుగుతున్న అసమతౌల్యానికి ఇదో హెచ్చరిక వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. 

 

హైదరాబాదుకు చెందిన దియా మీర్జా గత నెలలో వ్యాపారవేత్త వైభవ్ రేఖిని వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకల్లో పర్యావరణానికి ఏ మాత్రం ప్రమాదం వాటిల్లకుండా సహజసిద్ధమైన పదార్థాలనే వాడారు. దియా మీర్జా చివరి సారి నిరుడు అనుభవ్ సిన్హా సినిమా తప్పడ్ లో నటించారు. 

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాతో ఆమె తిరిగి సీని రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇది పూర్తిగా యాక్షన్ సినిమా అని, తాను ఈ సినిమాలో భావోద్వేగపరమైన పాత్రలో నటిస్తున్నానని ఆమె చెప్పారు. అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ సినిమా వస్తోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు దియా మీర్జా, నయామీ ఖేర్, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్నారు. 

దియా మీర్జా పర్యావరణ పరిరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్టు తయారు చేయడం, వంట గదిని ప్లాస్టిక్ రహితంకా ఉంచడం, షూట్స్ కు మెటల్ బాటిల్స్ తీసుకుని వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?