దారుణం: 90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

Siva Kodati |  
Published : Aug 04, 2019, 05:25 PM IST
దారుణం: 90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

సారాంశం

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన తొంభై ఏళ్ల వృద్ధురాలిపై దల్బీర్ గుజ్జర్ అనే వ్యక్తి శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ముసలి ప్రాణం గోడు వినేనాథుడు లేకుండా పోయాడు. 

కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు వయసుతో సంబంధం లేకుండా పోతోంది. పసిమొగ్గలను తమ కామవాంఛలకు బలి చేస్తున్న కామాంధులు.. వృద్ధులను సైతం వదలడం లేదు. తాజాగా ఓ వ్యక్తి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన తొంభై ఏళ్ల వృద్ధురాలిపై దల్బీర్ గుజ్జర్ అనే వ్యక్తి శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ముసలి ప్రాణం గోడు వినేనాథుడు లేకుండా పోయాడు.

అనంతరం తన కోడలికి  జరిగిన దారుణాన్ని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్