బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం

Published : Feb 23, 2021, 08:10 AM IST
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం

సారాంశం

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు.

పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మందితో వెళ్తున్న ప్యాసెంజర్ ఆటో, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. కటిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో 31వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

పది మంది సభ్యులు గల బ్యాండ్ బృందం పూర్నియా నుంచి ఆటోలో బయలుదేరింది. కుర్షేల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. దాంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మిగతా నలుగురు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో మరణించారు. 

ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ పరారైనట్లు కటిహార్ ఉన్నతాధికారి అమర్ కాంత్ తెలిపారు. మృతులను అర్డున్ మోచి (50), కిశోర్ పాశ్వాన్ (45), ధర్మేంద్ర కుమార్ మండాల్ (50), సుశీల్ కుమార్ మోచి (30), చోటేలాల్ రామ్ (42)లుగా గుర్తించారు. వారంతా మజ్ దిహా గ్రామానికి చెందినవారు.

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం