సంవత్సరాలపాటు పాక్ జైల్లో నరకం.. ఎట్టకేలకు భారత్ కి..

By telugu news teamFirst Published Nov 17, 2020, 9:29 AM IST
Highlights

కుటుంబసభ్యులను చూసి షంషుద్దీన్ కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు. తను పాకిస్తాన్ కి పొరపాటున వెళ్లానని.. అదే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పని షంషుద్దీన్ పేర్కొన్నాడు.

సరదాగా కొన్ని రోజులు పాకిస్తాన్ చూసి వద్దామని అనుకున్నాడు. కానీ.. అనుకోకుండా.. అక్కడే ఇరుక్కుపోయాడు. దీంతో.. అతనిని తీసుకువెళ్లి పాకిస్తాన్ జైలులో పడేశారు. దాదాపు 30 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయాడు. ఎట్టకేలకు స్వదేశానికి రాగలిగాడు. ఈ సంఘటన కాన్పూర్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాన్పూర్ కి చెందిన షంషుద్దీన్..1992లో పాక్ చూసి రావడానికి విజిటింగ్ వీసా మీద వెళ్లాడు. అయితే.. అక్కడ అనుకోకుండా ఉండిపోవడంతో.. పాక్ జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. కాగా.. ఇటీవల వదిలేయడంతో.. స్వదేశానికి చేరుకున్నాడు.  కాగా.. ఇంటికి చేరుకున్న అతనిని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

కుటుంబసభ్యులను చూసి షంషుద్దీన్ కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు. తను పాకిస్తాన్ కి పొరపాటున వెళ్లానని.. అదే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పని షంషుద్దీన్ పేర్కొన్నాడు. వలసదారులను పాకిస్తాన్ లో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అతను చెప్పాడు. మరీ ముఖ్యంగా భారత్ నుంచి వచ్చారని తెలిస్తే.. శత్రువులుగా చూస్తారని అతను పేర్కొన్నాడు.

తాను 1992లో 90 రోజుల వీసాతో పాకిస్తాన్ కి వెళ్లానని అతను చెప్పాడు. ఆ తర్వాత 1994లో తనకు పాక్ సిటిజన్ షిప్ వచ్చిందని చెప్పాడు. అయితే..2012లో తనను వసలదారుడి పేరిట జైల్లో పెట్టారని.. అప్పటి నుంచి స్వదేశానికి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. అతను ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. 

click me!