ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. హోటల్‌లో చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి

Published : Aug 27, 2023, 05:22 PM IST
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. హోటల్‌లో చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి

సారాంశం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా ఘటన స్థలంలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో మంటలను ఆర్పేందుకు, భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదం నేపథ్యంలో ఎనిమిది మందిని అక్కడి నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations