గుడ్‌న్యూస్: దేశంలో తగ్గుతున్న కేసులు, 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్

Published : Feb 08, 2021, 06:03 PM IST
గుడ్‌న్యూస్: దేశంలో తగ్గుతున్న కేసులు, 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్

సారాంశం

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుతున్నాయి.రోజువారీ కేసులు కూడ తగ్గాయి. అంతేకాదు దేశంలోని సుమారు 17 రాష్ట్రాల్లో కరోనాతో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గుతున్నాయి.రోజువారీ కేసులు కూడ తగ్గాయి. అంతేకాదు దేశంలోని సుమారు 17 రాష్ట్రాల్లో కరోనాతో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.గత 10 రోజులుగా రోజువారీగా  150 కంటే తక్కువగానే కేసులు నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత కేంద్రాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.

అండమాన్ నికోబార్, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, లక్షద్వీప్, లడ్ధాఖ్, సిక్కిం, రాజస్థాన్, మేఘాలయ, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.

గత 24 గంటల్లో దేశంలో 11,831 కొత్త కేసులు నమోదయ్యాయి. 11,904 కరోనా నుండి కోలుకొన్నారు. రోజువారీ కొత్త కేసులు కేరళ రాష్ట్రంలో నమోదౌతున్నాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 6,075 కేసులు బయటపడ్డాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో  ఒక్కటైన ఇండియాలో  కరోనా కంట్రోల్ లో ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

TVK Government Formation: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ ఫ్యాన్స్ సంబరాలు | Asianet Telugu
TVK Vijay Assets 2026 Rs: విజ‌య్ ఆస్తులు తెలిస్తే దిమ్మదిర‌గాల్సిందే | Asianet News Telugu