తెర వెనక చుట్టరికాలు...తెర మీదకు వస్తే...జనాలు ఎగబడతారా...ఏమో 'మనం' సినిమా మ్యాజిక్ జరిగింది కదా మనకీ అలా జరగుతుంది అనిపించవచ్చు. అందుకు కథ కూడా డిమాండ్ చేసిందని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ మ్యాజిక్ అందుకు తగ్గ కథ దొరికినప్పుడే జరుగుతుంది. మామ,అల్లుళ్ల బంధం వాళ్ల కుటుంబాలకే కాక మిగతావాళ్లకు కూడా ఆసక్తిగా ఉండాలనిపించే క్యారక్టరైజేషన్స్, కాంప్లిక్ట్స్ పడాలి. మరి అవన్నీ వెంకీ మామకు సెట్ అయ్యాయా, సినిమా కథేంటి..మరో సారి వీళ్ల కాంబినేషన్ చేసేటంత కిక్ ఇచ్చే సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
కథేంటి
undefined
రామ నారాయణ (నాజర్) ఊరి పెద్ద మనిషి. ఆయన పెద్ద జ్యోతిష్యుడు కూడా. ఆయన విధిని నమ్ముతూంటాడు. ఆయన నమ్మే శాస్త్రం ప్రకారం ఆయన మనవడు కార్తీక్ (నాగచైతన్య) ..శ్రీకృష్ణ అంశంతో పుట్టాడని తెలుస్తుంది. దాంతో పుట్టిన సంవత్సరం లోగా తన తల్లి, తండ్రి మరణానికి కారణమవుతాడని లెక్క వేస్తాడు. అలాగే జరుగుతుంది. తల్లి,తండ్రిలేని కార్తీక్ ని మేనమామ వెంకట రత్నం (వెంకటేష్) సొంత బిడ్డలా పెంచటం మొదలెడతాడు. వాడి కోసం తన జీవితాన్ని, తన వివాహాన్ని త్యాగం చేస్తాడు. పెరిగి పెద్దైన కార్తీక్..ఎమ్మల్యే (రావు రమేష్)కుమార్తె హారిక (రాశిఖన్నా) తో ప్రేమలో పడతాడు. అయితే ఇది ..రావు రమేష్ కు ఇష్టం ఉండదు. దాంతో మామా, అల్లుళ్ల మధ్య చిన్న విభేదం క్రియేట్ చేసి విడకొడతాడు. ఆ తర్వాత కార్తీక్ హఠాత్తుగా మాయమైపోతాడు.
ప్రాణంగా చూసే తన మేనమామను వదిలేసి, కార్తీక్ ఓ రోజు ను వదిలేసి వెళ్లిపోయి ఆర్మీలో చేరుతాడు. అయితే అక్కడ నుంచి హఠాత్తుగా మిస్ అయ్యాడు. ఈ క్రమంలో తన మేనల్లుడుని వెతుక్కుంటూ కాశ్మీర్ బోర్డర్ కు వెళ్లిన వెంకి అక్కడ అరస్ట్ అవుతాడు. మరో ప్రక్క తాతగారైన రామ నారాయణ ఓ విధమైన భయంతో ఉంటాడు. అసలు కార్తీక్ తనను ప్రాణంగా చూసే మామకు చెప్పకుండా..కాశ్మీర్ బోర్డర్ కు ఎందుకు వెళ్లాడు. అసలు వీళ్లిద్దరి మధ్యా ఏం జరిగింది. కేవలం రావు రమేష్ పెట్టిన గొడవ వల్లే విడిపోయారా...
వెంకి ప్రేమ వ్యవహారం లోకల్ టీచర్ (పాయిల్ రాజపుత్) తో ఏమైంది... నెగిటివ్ రోల్ లో కనిపించే దాసరి అరుణ్ క్యారక్టర్ ఏమిటి...చివరకు తన మేనల్లుడు ని తీసుకుని వెంకి వెనక్కి వచ్చాడా, రామనారయణ అంతగా భయపడే విషయం ఏమిటి..శ్రీకృష్ణ అంశంలో మిగతా ఎలిమెంట్స్ ఏమిటి..అవి కథలో ఏ విధంగా ప్లే చేసాయి.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ,కథనం
ఇది జాతకాలు చుట్టు తిరిగే మామా అల్లుళ్ల ఎమోషనల్ స్టోరీ. బంధాలు, అనుభందాలు ఏ కాలంలో అయినా ఒకటే కానీ దాన్ని డీల్ చేసే విధానంలోనే తేడా ఉంటుంది. మారిన కాలంతో పాటు కథ,కథనం మారకపోతే ఖర్చైపోతామని ఈ సినిమా హెచ్చరిస్తుంది. సినిమాలో ప్రధాన పాత్రలు నమ్మే జాతకాన్ని చూసే ప్రేక్షకుడు లైట్ తీసుకుంటే లాభం లేదు. అలాగే పురాణాల్లోని కృష్ణుడు జాతకాన్ని గుర్తు చేసేలా... తన మేనమామకు గండంగా మారాడు అంటూ కథ నడిపే ప్రయత్నం చేసారు.అంతవరకూ బాగానే ఉంది. అయితే దాన్ని ట్రీట్మెంట్ గా మార్చే ప్రక్రియలోనే తడబడ్డారు. ముఖ్యంగా కథకు కీలకంగా ఉండాల్సిన మామ, అల్లుళ్ల కాంప్లిక్ట్ బలంగా లేదు. దాంతో వాటి నుంచి వచ్చే సీన్స్ కూడా తేలిపోయాయి. అలాగే నెగిటివ్ రోల్స్ రావు రమేష్, దాసరి అరుణ్ ల కూడా స్ట్రాంగ్ గా లేవు. కథని అప్పటికప్పుడు నడిపించటానికి మాత్రమే వాడారు. కథలో విలన్ జాతకమా, లేక టెర్రిరిస్ట్ లా, లేక ఎమ్మల్యే రావు రమేష్ నా అనేది క్లారిటీ ఇచ్చి అటు వైపుగా కథ నడిపితే ఖచ్చితంగా వర్కవుట్ అయ్యేది.
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే....
ప్రారంభం ఎత్తుగడ దాకా అంటే..తన మేనల్లుడుని ...వెంకీ వెతుక్కుంటూ కాశ్మీర్ వెళ్లేవరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే ప్లాష్ బ్యాక్ స్టార్టైందో..ఫాల్ అప్పుడే మొదలైంది. కాంప్లిక్ట్ లేకుండా ఇంటర్వెల్ దాకా సీన్స్ వచ్చి వెళ్లిపోతాయి.అయితే ఆ సీన్స్ లో అక్కడక్కడా ఫన్ ఉండటంతో సమస్య అనిపించదు. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ అయ్యిందో అప్పుడే చూసే వాళ్లకు సమస్య మొదలవుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ నుంచి ఆర్మీ కు కథ షిప్ట్ అయ్యిందో అక్కడ నుంచి కథ కదలిక ఆగిపోయింది. టెర్రరిస్ట్ గ్రూప్ లు, ఇండియన్ ఆర్మీ, దేశభక్తి అంటూ అప్పటిదాకా లేని ఎలిమెంట్స్ ని భుజాన ఎత్తుకుని విసిగించటం మొదలెడుతుంది. టెర్రరిస్ట్ లను వెంకీ డీల్ చేయటం వాళ్ళు సీరియస్ గా తీసినా మనకు నవ్వు వస్తూంటుంది. అలా స్టోరీ లైన్ అయిన శ్రీకృష్ణ అంశ ..ట్రీట్మెంట్ స్దాయిలో సాగుతూ,సంభంధం లేని ఎలిమెంట్స్ కలుపుకుంటూ ఫెయిలైంది. మొత్తానికి స్క్రీన్ ప్లే సినిమాకు సరిగ్గా సెట్ కాలేదు.
ఏం బాగున్నాయి
వెంకటేష్ క్యారక్టరైజేషన్, రెండు మాస్ సాంగ్స్ , అక్కడక్కడా వచ్చే ఫన్
ధమన్ రీరికార్డింగ్, కెమెరా వర్క్
ఏం బాగోలేవు
మిగిలిందంతా
డైరక్షన్, మిగతా డిపార్టమెంట్స్
స్క్రిప్ట్ వీక్ గా ఉండటంతో డైరక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా సినిమాకు మిలటరీ బ్యాక్ డ్రాప్ పెద్ద మైనస్ గా,మహా నసగా మారింది. రైటర్ కూడా అయిన బాబి ఎందుకో ఆ విషయం గమనించినట్లులేరు. ఇక పైన చెప్పుకున్నట్లు పాటలు ఎలా ఉన్నా థమన్ రీరికార్డింగ్,ప్రసాద్ కెమెరా వర్క్ నిలబెట్టాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ ధాట్
చూసేవాడి జాతకం కూడా బాగుండాలి
Rating:2.5
---
తెర వెనక..ముందు
బ్యానర్: పీపుల్స్ మీడియా- సురేష్ ప్రొడక్షన్స్
నటీనటులు: వెంకటేష్, నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా, రావు రమేష్ తదితరులు
రిలీజ్ తేదీ: 13, డిసెంబర్ 2019
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: ప‌్రసాద్ మూరెళ్ల
నిర్మాతలు: టీ.జీ విశ్వప్రసాద్- సురేష్ బాబు