ప్లే బ్యాక్ సింగర్ గా సత్తా చాటిన శ్రీరామచంద్ర 'పాపం పసివాడు' సిరిస్ తో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు.
ప్లే బ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 5విన్నర్ శ్రీరామచంద్ర ప్రధాన పాత్రలో ఓ వెబ్ సీరిస్ రూపొందింది. రాశి సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య, మహర్షి కీలకపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29నుంచి ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. రిలీజ్ కు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సీరిస్ ఎలా ఉంది..అసలు కథేంటి , చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీలైన్
ఈవెంట్ మేనేజర్ క్రాంతి (శ్రీరామచంద్ర) గత ఆరేళ్లుగా డింపీతో (గాయత్రి చాగంటి) ప్రేమలో ఉంటాడు. ఆమెను పెళ్లిచేసుకుందామని ప్రపోజల్ పెడితే ఆమె కారణం చెప్పకుండా బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. దాంతో దేవదాసులా మారి, దాన్నుంచి బయిటపడటానికి ఫ్రెండ్ నాసా (మ్యాడీ మానేపల్లి ) ఇంటికి వెళ్తాడు . అక్కడ ఓ రోజు పబ్‌కు వెళ్లిన క్రాంతి అక్కడ పరిచయమైన చారు (రాశీసింగ్) ఇంటికి వెళ్లి... తాగిన మత్తులో ఆమె అపార్ట్‌మెంట్‌లోనే రాత్రి కి అక్కడే ఉండి కమిటైపోతాడు. ఈలోగా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచడటంతో అనూష ను (శ్రీవిద్య మహర్షి) పెళ్లిచేసుకోవడానికి ఓకే చెప్తాడు క్రాంతి. ఆ ఎంగేజ్‌మెంట్ వేడుకకు అనుకోకుండా పబ్ అమ్మాయి చారు వస్తుంది. అది చాలదన్నట్లుగా క్రాంతికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన డింపీ మళ్లీ అతడికి జీవితంలోకి వస్తుంది, అప్పుడేమైంది? చివరకు క్రాంతి ఎవరితో సెటిల్ అయ్యాడు అనేది ఈ వెబ్‌సిరీస్ కథ.
ఎలా ఉంది
ఐదు ఎపిసోడ్స్ తో సాగే ఈ సీరిస్ ఊహించినంత ఫన్ గా ఉండదు. అళా వెళ్లిపోతుంది. అలాగే రొటీన్ గా అనిపిస్తుంది. కొత్తదనం అక్కడక్కడా మాత్రమే తొంగి చూస్తుంది. అయితే ప్రేమ, పెళ్లి లాంటి విషయాలలో ప్రస్తుత యూత్ ఎంత కన్ఫూజింగ్ గా ఉన్నారు..వారి ఆలోచనధోరణి ఏ విధంగా ఉంది అన్నది సహజంగా చూపించే ప్రయత్నం చేసారు. ఫోర్స్‌డ్ కామెడీ ని పెట్టలేదు. డైలాగ్స్ ద్వారా కథలో ఫన్ రప్పించే ప్రయత్నం చేసారు. హైదరాబాదీ స్లాంగ్‌లో శ్రీరామచంద్ర, శ్రీవిద్య మహర్షి చెప్పిన డైలాగ్స్ సీరిస్ గా హైలెట్ గా నడుస్తోంది. క్లైమాక్స్ డిఫరెంట్ గా డిజైన్ చేయటం బాగుంది. అయితే సీరిస్ లో పెద్దగా ట్విస్ట్ లు లేవు. ఉన్నవి కాసినీ పేలలేదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది.
శ్రీరామ చంద్ర నటుడుగా కూడా బాగానే రాణించారు. నాసా పాత్రలో మ్యాడీ కామెడీ బాగుంది. బలగం వేణు, అశోక్ కుమార్, అంబటి కూడా తమ పరిధుల మేర నవ్వించారు. టెక్నికల్ గా సీరిస్ కు తగినట్లుగా సౌండ్ గానే ఉంది. క్రాంతి క్యారక్టర్ ని కన్ ఫ్యూజ్డ్ గా చూపించాలనుకున్నారు. కానీ ఇంకాస్త వర్కు చేస్తే బాగుండేది. ఏదో కొత్తగా ట్రై చేయాలని చూశారు కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు.
చూడచ్చా
చెప్పుదగ్గ సినిమాలు థియేటర్ లోలేవు అని ఫీలైనప్పుడు కాలక్షేపానికి ఈ సీరిస్ ట్రై చేయచ్చు
నటీనటులు : శ్రీరామ చంద్ర, రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య మహర్షి, మ్యాడీ మనేపల్లి, అశోక్ కుమార్, సుజాత, శ్రీనివాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ : గోకుల్ భారతి
సంగీతం, సాహిత్యం : జోస్ జిమ్మీ
నిర్మాత : అఖిలేష్ వర్ధన్
దర్శకత్వం : లలిత్ కుమార్ .