లవ్ లెటర్: నువ్వంటే నాకు ప్రేమ ఎందుకంటే...

Published : Nov 22, 2019, 01:20 PM IST
లవ్ లెటర్: నువ్వంటే నాకు ప్రేమ ఎందుకంటే...

సారాంశం

మొబైల్ వచ్చిన తర్వాత చాటింగ్ కారణంగా లేఖలు రాయడం తగ్గిపోయింది. కానీ ప్రేమలేఖలు రాయడంలో ఏ అందం ఉంది. మన భావాలను, మన ప్రేమను రాతలో వ్యక్తం చేసినంతగా చాటింగ్ లో వ్యక్తం చేయలేం.. చూడండి.

ప్రియా!

నువ్వుంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం ఎందుకుంటే దానికి కారణాలు నేను చెప్పలేను. ప్రేమ గుడ్డిది అంటారు. అది గుడ్డిదో కాదో కూడా నాకు తెలియదు. 

"ఎలా సలిలమ్ము పారు
గాలేల వీచు
ఏల ప్రేమింతు నిన్ను" అన్నాడు ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. నీకు తెలుసో లేదో.. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసింది చాలా వరకు ప్రేమ కవిత్వమే. అది సరే, కారణం తెలియదు అని చెప్పడానికి, సలిలము ఎందుకు ప్రవహిస్తోందో, గాలి ఎందుకు వీస్తుందో తెలియనట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నానని అన్నాడాయన

నేను అంతకన్నా ఏమీ చెప్పలేను. మనసు నిండా నువ్వే పరుచుకుని ఉన్నావు. ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా నీ ధ్యానమే... 

నీ కోసమె ఆవేదన
నీ రూపమె ఆలాపన అని ఓ సినీ కవి అన్నాడే, అది నేను అన్నట్లుగానే ఉంది. 

నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను మాటల్లో చెప్పలేను. అందుకే ఈ చిన్న ప్రేమ లేఖ నీకోసం...

ఇట్లు,
నీ....

నోట్: మీరు ఈ లెటర్ ను పంపించుకోవచ్చు.. కానీ, ఏ విధంగానూ దుర్వినియోగం చేయకూడదని హెచ్చరిస్తున్నాం.

PREV
click me!

Recommended Stories

Putin PA Dmitry Peskov: రష్యా అధ్యక్షుడి పీఏ మామూలు ఆటగాడు కాదు.. భార్యను ఎలా ఇంప్రెస్‌ చేశాడంటే!
Marriage – Experts Advice: భార్యపై అనుమానం ఎందుకు వస్తుంది? ఇలా గుర్తించి.. ఇట్టే పరిష్కరించుకోండి!