
లక్నో: వరుసగా మూడో దఫా ఆమేథీలో స్మృతి ఇరానీ ఓటమి పాలు కావడం తథ్యమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా జోస్యం చెప్పారు. ఆమె అమితాబ్ బచ్చన్‌ను కాపీ కొట్టాలని చూస్తున్నారని ఆఖరికి ఓ విలన్‌లా మిగిలిపోతారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆమెథీ ప్రజల ఆశీర్వాదంతో స్మృతి ఇరానీని ఓడించినా రాజకీయ ప్రత్యర్థిగా ఆమెను ఎల్లప్పుడూ గౌరవిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. అమేథీ సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్‌లో కూడా పోటీ చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమంటూ స్మృతి ఇరానీ విమర్శలు చేసింది.ఈ విమర్శలపై ఆయన స్పందించారు.
ఆమేథీ ప్రజల ఆశీర్వాదంతో ఆమెను ఓడించి తీరుతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రాహుల్ చేతిలో ఓడిపోతే మోడీ ఆమెకు రాజ్యసభ సీటును ఇస్తారని ఆయన చెప్పారు. స్మృతి తన జీవిత కాలంలో పంచాయితీ ఎన్నికల్లో కూడ గెలవరనే విషయాన్ని గమనించాలన్నారు.
ఆమేథీలో స్మృతి ఇరానీ రాహుల్‌పై పోటీ చేస్తూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ దఫా ఆమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుండి కూడ రాహుల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.