ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై చెప్పు దాడి..!!

Siva Kodati |  
Published : Apr 01, 2019, 05:40 PM IST
ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై చెప్పు దాడి..!!

సారాంశం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి  చెప్పు విసిరాడు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి  చెప్పు విసిరాడు. వివరాల్లోకి వెళితే... సోమవారం తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.

ఈ క్రమంలో ఆయన ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో ఓ దుండగుడు ఆయనను లక్ష్యంగా చేసుకుని చెప్పు విసిరాడు. అయితే నాటరాజన్ చేయి అడ్డుపెట్టడంతో అది ముఖ్యమంత్రికి తగలలేదు.

కాగా, చెప్పు విసిరిన దుండగుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. జనం భారీగా ఉండటంతో పాటు అక్కడ కెమెరాలు కూడా లేకపోవడంతో ఆగంతకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు