మోడీపై బ్రహ్మాస్త్రం: వారణాసి నుంచి ప్రియాంక..?

By Siva KodatiFirst Published Mar 29, 2019, 7:58 AM IST
Highlights

గత ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఈదఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ.. వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తోంది.

గత ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఈదఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ.. వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తోంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీని వారణాసిలో ఓడించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానిపైకి పోటీగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇందుకు కారణం ప్రియాంక చేసిన వ్యాఖ్యలే.. తన తల్లి సోనియా గాంధీ తరపున ఆమె రాయబరేలీలో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు ‘ మీరే ఇక్కడ పోటీ చేయొచ్చుగా ’ అని కోరారు.

దానికి ఆమె వెంటనే ‘‘ ఏం వారణాసి నుంచి వద్దా’’ అని ప్రశ్నించారు. దీనికి వారు ఎక్కడైనా సరే అనడంతో మళ్లీ జోక్యం చేసుకున్న ప్రియాంక గాంధీ.. వారణాసి నుంచి పోటీ చేయనా..? వద్దా’’ అంటూ పదే పదే అడిగారు.

దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మోడీపై బ్రహ్మాస్త్రం అంటూ కాంగ్రెస్ నేతలు సంబరపడుతుండగా.. బీజేపీ నేతలు సైతం ఇందుకు ధీటుగా బదులిస్తున్నారు.

రండి... తొలి పోటీలోనే ఓడిపోయిన నేతగా రికార్డు సృష్టించవచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రియాంక గాంధీ నిజంగా మోడీపై పోటీ చేస్తారా లేదా తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.  

click me!