ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని

Siva Kodati |  
Published : Apr 23, 2019, 09:11 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని

సారాంశం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రాణిప్‌లోని నిషాన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మోడీ ఓటు వేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రాణిప్‌లోని నిషాన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మోడీ ఓటు వేశారు. ప్రోటోకాల్ పక్కన బెట్టి సాధారణ ప్రజలతో పాటు క్యూలైన్‌లో నిల్చొని ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేసి తన బాధ్యతను నెరవేర్చానన్నారు. సొంత రాష్ట్రంలో ఓటు వేయడం కుంభమేళాలలో పాల్గొన్నంత సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి చేరుకున్న ప్రధాని.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు