గంభీరే కుబేరుడు: లాస్ట్ ప్లేస్‌లో షీలా దీక్షిత్

By Siva KodatiFirst Published Apr 24, 2019, 3:38 PM IST
Highlights

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో పలువురు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లు, ఇతర వివరాలను బట్టి టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఈస్ట్ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో పలువురు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లు, ఇతర వివరాలను బట్టి టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఈస్ట్ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

ఆయన తన ఆస్తుల విలువను రూ.147 కోట్లుగా వెల్లడించారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆయన తన ఆదాయాన్ని రూ.12.4 కోట్లుగా ఐటీ రిటర్న్స్‌లో చూపారు. అలాగే తనపై ఓ క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

తన భార్య నటాషా గత సంవత్సరం ఐటీ రిటర్న్స్‌లో తన ఆదాయాన్ని రూ. 6.15 కోట్లుగా పేర్కొన్నారు. గంభీర్ తర్వాత స్థానంలో ఢిల్లీ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మహబల్ మిశ్రా నిలిచారు.

మిశ్రా తన మొత్తం ఆస్తిని రూ.45 కోట్లుగా చూపించారు. ఢిల్లీ సౌత్ నుంచి పోటీ చేస్తున్న ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ తన ఆస్తుల విలువను రూ.12.4 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆస్తి రూ.24 కోట్లు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆస్తి విలువ రూ.4.92 కోట్లుగా చూపించారు. 

click me!