భారీ భద్రత నడుమ కశ్మీర్ లోయలో పోలింగ్

By telugu teamFirst Published Apr 18, 2019, 7:51 AM IST
Highlights

దేశవ్యాప్తంగా గురువారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా సాయుధ దళాల జవాన్ల బందోబస్తు మధ్య జమ్మూ కశ్మీర్ లోయలో గురువారం ఉదయం ఏడుగంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 

దేశవ్యాప్తంగా గురువారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా సాయుధ దళాల జవాన్ల బందోబస్తు మధ్య జమ్మూ కశ్మీర్ లోయలో గురువారం ఉదయం ఏడుగంటలకే పోలింగ్ ప్రారంభమైంది. శ్రీనగర్, ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సాగుతోంది.

 ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గంలోని దోడ పోలింగ్ కేంద్రం ముందు సాయుధ పహరా నీడలో ప్రజలు ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరి కనిపించారు. కథువా గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద పారామిలటరీ బలగాలను మోహరించారు.క

ట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ ప్రారంభించామని జమ్మూకశ్మీర్ ఎన్నికల అధికారులు చెప్పారు.  గత గురువారం మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి.

click me!