వెంటబడ్డ బీజేపీ కార్యకర్తలు: మమత కారు దిగగానే... పరుగో పరుగు

By Siva KodatiFirst Published May 5, 2019, 5:26 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని చూడగానే బీజేపీ కార్యకర్తలు కారు దిగి పరిగెత్తారు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని చూడగానే బీజేపీ కార్యకర్తలు కారు దిగి పరిగెత్తారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ మిడ్నాపూర్‌లో ఓ బహిరంగసభలో పాల్గొనేందుకు శనివారం మధ్యాహ్నం ఆమె రోడ్డు మార్గంలో వెళుతున్నారు.

ఈ క్రమంలో చంద్రకొండ వద్ద కొందరు గ్రామస్తులు సీఎం కాన్వాయ్ చూసి ‘జై శ్రీరాం’ అంటూ బీజేపీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహానానికి గురైన మమత.. వెంటనే కారు దిగి వచ్చారు.

ముఖ్యమంత్రిని చూసిన వెంటనే వారు పరుగు తీశారు. దీంతో మమత వారిని చూసి ఎందుకు పారిపోతున్నారు ఇలా రండి అని పిలిచారు.. వాళ్లంతా చాలా తెలివిగా తప్పించుకున్నారన్న ఆమె అనంతరం బహిరంగసభ వద్దకు వెళ్లారు.

బహిరంగసభలో మాట్లాడుతూ.. నినాదాలు చేస్తున్న వారంతా మే 23న ఎన్నికల ఫలితాలు చూసి బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కూడా వారు బెంగాల్‌లోనే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విభజన రాజకీయాలు చేస్తూ.. ఘర్షణలు ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘జై శ్రీరాం నినాదాలు వినగానే మమతకు ఎందుకు అంత కోపం వచ్చిందని .... అదేదో వినకూడని మాట అన్నట్లు ఎందుకు అలా ప్రవర్తిసున్నారని ట్వీట్ చేసింది.

click me!