ప్రచారానికి రూ.75 లక్షలిస్తారా, కిడ్నీ అమ్ముకోమంటారా: ఈసీకి అభ్యర్థి లేఖ

By Siva KodatiFirst Published Apr 16, 2019, 11:11 AM IST
Highlights

ఎన్నికల ఖర్చుల కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అభ్యర్థి ఈసీకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది

ఎన్నికల ఖర్చుల కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అభ్యర్థి ఈసీకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బాలాఘాట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కిశోర్ సంరితీ గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగారు.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన తనకు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డబ్బు లేదని... తనకు రూ.75 లక్షలు నిధులు ఇవ్వాలని లేదంటే, నిధులు సమకూర్చుకునేందుకు తన కిడ్నీ అమ్ముకునేందుకు అనుమతించాలని ఆయన ఈసీకి లేఖ రాశారు.

లోక్‌సభ ఎన్నికల్లో రూ.75 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం నిర్ణయించిందని, తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద అంత డబ్బు లేదన్నారు. ఎన్నికల్లో పోటీకి గాను రూ. 75 లక్షలు ఇవ్వాలని, లేదంటే బ్యాంక్ నుంచి రుణం ఇప్పించాలని కిశోర్ అభ్యర్థించాడు.

ఎన్నికల ప్రచారానికి కేవలం 15 రోజులే సమయం ఉండటంతో వీలైనంత త్వరగా తనకు నిధులు కేటాయించాలని కోరాడు. ఈ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులంతా అవినీతిపరులని, వారు స్థానికుల నుంచి డబ్బులు వసూలు చేసి ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని కిశోర్ ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలిస్తే బాలాఘాట్ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి పాటు పడతానని ఆయన స్పస్టం చేశారు. 

click me!