రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దవాతావరణం నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
వరంగల్: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దవాతావరణం యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ విశ్వశాంతికి విఘాతం కలిగిస్తోంది. ప్రపంచ దేశాలన్ని రెండుగా చీలిపోయి దాదాపు మూడవ ప్రపంచ యుద్ధపు అంచులవరకు పరిస్థితి వెళ్ళింది. ఇలా అత్యంత భయానక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తోంది "వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ " అనే అంతర్జాతీయ సంస్థ. ఈ క్రమంలోనే "WORLD PEACE-POETS MEET (ప్రపంచ శాంతి- కవి సమ్మేళనం)" పేరుతో ఓ బహుభాషా కవి సమ్మేళననాన్ని ఏర్పాటు చేసింది.
మంచికీ, మానవత్వానికీ, ప్రపంచ శాంతికై జీవితాంతం పోరాడుతూ ఉండే కవులను సమీకరించి... వారి కలాల బలాన్ని విశ్వశాంతికి జోడించాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. తెలుగుతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషా కవుల నుండి కవితలను సేకరించాలని ఈ సంస్థ భావిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో వుంంచుకుని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషా కవులు ఒకొక్కరు ఏదేని ఒక భాషలో ఒక కవితను వినిపించించాల్సి ఉంటుంది. కవులు తాము వినిపించాలనుకునే కవితలను ముందుగా ఈ సంస్థ సభ్యులైన ప్రొఫెసర్ జి. నరసింహా మూర్తి (9849503180), శనిగరపు రాజమోహన్( 9676950683), నిమ్మల శ్రీనివాస్ (9949709866) లకు ఈ నెల 5వ తేదీ మద్యాహ్నం 2గంటలలోపు అందించాలని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఈ కవితా పోటీలో పాల్గొన్న కవులతో పాటు మిగతా వారితో కవిసమ్మేళనం మార్చ్ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఆదివారం రోజు డైట్ కాలేజ్ హన్మకొండలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవుల గ్రూప్ ఫోటో రష్యా, ఉక్రైన్, అమెరికాలతోపాటు ఐక్యరాజ్య సమితికి కూడా పంపనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులు ముహమ్మద్ సిరాజుద్దీన్ తెలిపారు.
undefined
ఇదిలావుంటే ఆచార్య సూర్యాధనంజయ్, రమేశ్ కార్తిక్ నాయక్ సంపాదకత్వంలో వెలువడబోతున్న గిరిజన, ఆదివాసి కథా సంకలనం "మళావ్" కోసం ఆసక్తిగల వారినుండి కథలను ఆహ్వానిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవిస్తున్న ఏ తెగ అయినా పర్లేదు... కథలు రాసి పంపించాల్సి వుంటుంది. ఆ కథలను 10 ఏప్రిల్ 2022 లోపు rameshkarthik225@gmail.com మెయిల్ ఐడికి పంపాలని, వచ్చిన కథల నుండి ఎంపిక చేసిన కథలతో సంకలనం తీసుకొస్తున్నట్టు రమేశ్ కార్తిక్ నాయక్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్ : 7286942419.
ఇక రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను 'వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం' ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని, పద్మశ్రీ డా.ఆశావాది ప్రకాశరావు స్మారకార్థం నిర్వహిస్తున్నారు. మార్చి 25 వ తేది లోపు 9962544299 వాట్సప్ నెంబర్ కు ఐదుపద్యాలు మాత్రమే పంపాలి. ఉగాది సందర్భంగా పదివేల రూపాయల బహుమతులు కవులకు అందచేస్తున్నట్టు సంస్థ సమన్వయ కర్త డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.