ప్రముఖ కవి విల్సన్‌రావు కొమ్మవరపు కవితా సంపుటి - నాగలి కూడా ఆయుధమే - ఆవిష్కరణ మరియు అంకితోత్సవ సభ ఈ నెల 19వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో జరుగుతుంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో విల్సన్ రావు కొమ్మవరపు కవితా సంపుటి నాగలి కూడా ఆయుధమే..! ఆవిష్కరణ మరియు అంకితోత్సవ సభ ఈ నెల 19వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుందని పాలపిట్ట సంపాదకులు గుడిపాటి ఒక ప్రకటనలో తెలియజేసారు. సభకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. పుస్తకాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరిస్తారు. కె. శివారెడ్డి పుస్తకాన్ని అంకితం తీసుకుంటారు. సభలో కె. శ్రీనివాస్, కోయి కోటేశ్వరరావు, మామిడి హరికృష్ణ, కవి యాకూబ్, ఎం. నారాయణశర్మ, ఎం.వి.రామిరెడ్డి, జెల్ది విద్యాధర్ రావు ప్రభృతులు ప్రసంగిస్తారు.
ఇదివరలో విల్సన్‌రావు మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఇది నాలుగో కవితా సంపుటి. దేవుడు తప్పిపోయాడు కవితా సంపుటి ద్వారా తెలుగు కవిత్వ ప్రపంచం మీద తనదైన ముద్ర వేసిన కవి విల్సన్‌రావు. ఈ కవితా సంపుటిపై డెబ్బయిమందికి పైగా వెలువరించిన స్పందనలతో ప్రేరణ అనే పుస్తకాన్ని మల్లెతీగ ప్రచురణల వారు ఇటీవల వెలువరించారు. ఇపుడు నాగలి కూడా ఆయుధమే అంటూ మన ముందుకొస్తున్నారు విల్సన్‌రావు.