ఆటా వేడుకల్లో భాగంగా డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
ఆటా వేడుకల్లో భాగంగా డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొలకలూరి ఇనాక్, ముఖ్య అతిధిగా నందిని సిధారెడ్డి హాజరవుతున్నారు. వేణు నక్షత్రం ఆహ్వానం పలుకుతారు. ఆటా మాట పేరుతో మధు బొమ్మినేని మాట్లాడుతారు. సాహిత్య వేడుకలు పేరుతో జయంత్ చల్లా, ఆటా సాహిత్య సేవలు పేరుతో రాజేశ్వరరావు టేక్మాల్ మాట్లాడనున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియారంగం అంశంపై కాసుల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాంతి స్వరూప్, ఐనంపూడి లక్ష్మీ, జె. శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, స్వామి ముద్దం, జెఎల్ నరసింహారెడ్డి, నలిమెల భాస్కర్, దెంచనాల శ్రీనివాస్, కొలకలూరి మధుజ్యోతి, నరాల రామిరెడ్డి, కొండపల్లి నీహారిణి తదితరులు వివిధ అంశాలపై మాట్లాడుతారు.
టేకులపల్లి గోపాల్ రెడ్డి, మధురాంతకం నరేంద్ర, మధుబాబు, పెద్దింటి అశోక్ కుమార్, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, మహ్మద్ గౌస్, హుమయూన్ సంఫీుర్, పత్తిపాక మోహన్, ఎస్.వి. సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందరపు హైమవతి, కందకూరి శ్రీరాములు, జల్లేపల్లి బ్రహ్మం, కవి యాకూబ్, వెల్డండి శ్రీధర్, రవీందర్ పసునూరి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాస్ తదితరులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమానికి జి. కిషన్ రావు అధ్యక్షత వహిస్తే, ముఖ్య అతిథులుగా జూలూరి గౌరీ శంకర్, మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిధిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరుకానున్నారు. తప్పెట రామ ప్రసాద్ రెడ్డి, బలగం వేణు, అల్లాణి శ్రీధర్, మామిడి హరికృష్ణ, షరీఫ్ మహ్మద్ కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ ఆటా వేడుకలు చైర్ జయంత్ చల్లా, కో చైర్ వేణు సంకినేని, లిటరరీ కమిటీ చైర్ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో జరగనున్నాయి.
కవులు, రచయితలకు ఏసియా నెట్ సాహితీ వేదిక స్వాగతం