తెలుగు కవి, రచయిత వేణు నక్షత్రం కరోనా వైరస్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల మీద వేదనతో కవిత రాశారు. ఆ కవితను ఇక్కడ చదవండి.
గాకరోనా డెల్టాలతోని - గన్నా గిన్నా
మస్త్ బాధల్ పడ్తిమి
ఆస్తులు పాయె- పాస్తులు పాయె
ఆఖరికి పానాలే పాయె
గంతల్నే వ్యాక్సిన్లు అనిరి - బూస్టర్ షాట్లు అనిరి
పోయినోండ్లు పోయిరి - ఇగ ఉన్నోల్లమన్న
జర్ర నిమ్మలంగుందాం అనుకుంటిమి
ఇగ అంత సద్దుమణిగి నట్టే అనిపించె
సినిమాలు, షికార్లు అన్నీ షురూ ఆయే
గంతల్నే పండుగొస్తుందనిరి
ఇగ పండుగనంగనే
పప్పు బెల్లాలు - పరమన్నాలు
అప్పాలు - చెగొడీలు
కోడి కూర - ముంత కల్లు
కొత్త బట్టలు -పతంగీలు
గంగిరెద్దులు - గంగి గోవులు
గివన్నీ గుర్తుకు రాంగానె
మన్సు మస్తు ఖుషీగయ్యే
ఇగ పండుగ షురూ చేద్దామనంగనే
మల్లా మొదలాయె కొత్తగా ఓమిక్రాన్!
దగ్గులు- తుమ్ములు
జ్వరాలు - నొప్పులు
మాస్కులు - శానిటైజర్లు
క్వారంటైన్ - క్వారంటైన్
‘పాడిందే పాడెరా పాసుపల్ల దాసరి’ అన్నట్లు
దీని పాడుగాను
మూడేండ్ల సందీ గదే ముచ్చట
ఇంకెన్ని రోజులిట్ల గడపాలో
ఇంకెన్ని తిప్పలు పడాలో
గాపాత రోజులెప్పుడొస్తయో!
కల్సి పండుగెపుడు సేసుకుంటమో!!