వసుంధర విజ్ఞాన వికాస మండలి 30 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కర్కముత్తారెడ్డి స్మారక కవితల పోటీలో అత్యుత్తమైన కవితలను ఎంపిక చేసి విజేతలను ప్రకటించారు.
వసుంధర విజ్ఞాన వికాస మండలి 30 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కర్కముత్తారెడ్డి స్మారక కవితల పోటీలకు విశేష స్పందన వచ్చింది. పోటీకి వచ్చిన కవితల నుంచి ఐదింటిని ఉత్తమ కవితలుగా ఎంపిక చేయడం జరిగింది. ' మట్టిపరిమళాల సేద్యం ' అనే అంశం మీద నిర్వహించిన ఈ పోటిల్లో అభివ్యక్తిలో వైవిధ్యం చూపిన విశ్వైక (హైదరాబాద్), అవనిశ్రీ (గద్వాల జోగులాంబ జిల్లా), కొండపల్లి నిహారిణి (వరంగల్), పొత్తూరి సీతారామరాజు (కాకినాడ), పి.రోహిణికుమార్ (పార్వతీపురం, మన్యంజిల్లా)లు విజేతలుగా నిలిచారు.
ఈ పోటీలకు నాళేశ్వరం శంకరం, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు మార్చి12న హైదరాబాద్ రవింధ్రభారతిలో మధ్యాహ్నం జరిగే సంస్థ వార్షికోత్సవంలో బహుమతులు అందజేస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు మధుకర్ వైద్యుల, అధ్యక్షులు చదువు వెంకటరెడ్డి, కన్వీనర్ వి.సుమలత ఒక ప్రకటనలో తెలిపారు.