ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ పాసువయ్య తమిళ కవితను తెలుగులో అందించారు. సముద్రం నవ్వింది అనే ఈ కవితను పాఠకుల కోసం అందిస్తున్నాం.
రాయికి కూడా ప్రాణమొచ్చి
కదిలి ఎగిరిపోయింది
అలలకు కాళ్లొచ్చి
వొడ్డుకు చేరాయి
కండరాలు ఎదిగి
వేదాల్ని పఠించాయి
మెదడు పెట్టిన గోలకు
ఏనుగులు బతుక్కి బాకా వూదాయి
వర్షమూ మెరుపులూ
వెనక ముఖం పట్టాయి
అంతా ముగిసింతర్వాత
ఓ దుఖం తలెత్తింది
ఎందుకని
అడిగింది ఆకాశం
నేనెవర్ని
అని అడిగింది ఇసుక
సముద్రం బిగ్గరగా నవ్వేసింది .
undefined
ఇంగ్లీష్: టి.ఎస్.దక్షిణా మూర్తి
తెలుగు: వారాల ఆనంద్