సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా హిందీ కవిత: ఎదురుచూపు

By telugu team  |  First Published Jan 7, 2021, 4:02 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవిత వారాల ఆనంద్ సర్వేశ్వర్ దయాళ్ సక్సెనా హిందీ కవితను ఎదురుచూపులు పేర అనువాదం చేసి అందించారు. ఆ కవిత చదవండి.


ఎదురు చూపు 
ఒక శత్రువు 
దాన్ని ఎప్పుడూ విశ్వసించొద్దు
తెలియని పొదల్లో 
చూడని పర్వతాలల్లో 
ఆకస్మిక దాడి చేయడానికి 
అది పొంచివుంటుంది 
మన మెంతసేపూ 
ఆకుల గలగలల్ని వింటూ వుంటాం
శత్రువు ఎదురు చూస్తున్నది 
దాన్నెప్పుడూ విశ్వసించకు


అవకాశం కోసం ఎదురుచూస్తూ 
చీకట్లో దాక్కునే సైనికుడు వాడు 
వాడి దృష్టి ఎప్పుడూ 
వెలుగులోవున్న వాడి పైననే
మనమేమో చీకట్లోకి 
కాగడాతో వెలుగుల్నీ ప్రసరిస్తూ వుంటాం
ఎదురు చూపు ఒక శత్రువు 
దాన్ని ఎప్పుడూ విశ్వసించొద్దు
కనిపించని చేప ఏదో ఈదుకుంటూ 
మనల్ని దాటేసినట్టు 
వాడో నదిలా మారతాడు
ఎదురు చూపు ఒక శత్రువు 
దాన్ని ఎప్పుడూ విశ్వసించొద్దు 
ఎదురుచూపును వదిలించుకోవాలి 
ఏది ఎప్పుడు కావాలనుకుంటే 
దాన్ని అప్పుడే పొందాలి
ఏది ఎప్పుడు చేయాలనుకుంటే 
ఎదురుచూడకుండా 
వెంటనే చేసేయాలి .

Latest Videos

 ఇంగ్లీష్: చంద్ర ప్రభా పాండే 
తెలుగు: వారాల ఆనంద్

click me!