తెలుగు రచయిత వారాల ఆనంద్ అనువాద కవిత 'స్త్రీ' ఇక్కడ చదవండి..
నేను నదిని
అతను సముద్రం
అతనితో నేనన్నాను
నా జీవితమంతా
నీ కోసం నీ వైపు
ప్రవహిస్తూ నీలో కరిగిపోతున్నాను
చివరాఖరికి నేను
సముద్రాన్నయి పోయా
ఒక స్త్రీ ఇచ్చే బహుమతి
ఆకాశం కంటే పెద్దది
కానీ నువ్వేమో నిన్ను నువ్వు
ప్రస్తుతించుకుంటూనే వున్నావు
నడివి కావాలని
నాలో కలిసిపోవాలని
ఎప్పుడూ అనుకోలేదు ఆలోచించలేదు
మారాఠీ మూలం : హీరా బన్సోడే
ఇంగ్లీష్ : వినయ్ ధార్వాడ్కర్