వడ్డెబోయిన శ్రీనివాస్  కవిత : ప్రైవేటు సూరీడు

By Pratap Reddy Kasula  |  First Published Dec 28, 2021, 2:12 PM IST

చలికాలపు  మంచుపూల గుబాళింపును హన్మకొండ నుండి రాస్తున్న  వడ్డెబోయిన శ్రీనివాస్   కవిత  "ప్రైవేటు సూరీడు" లో చూడండి.


ప్రైవేటు సూరీడు

చలిమేఘాలు తొడుక్కున్నాడు   
శ్వేతసూరీడు

Latest Videos

undefined

చలిచీర కట్టుకొని
ప్రకృతి ముఖం మీద   
మంచు చుక్కల సంక్రాంతి  ముగ్గులేస్తోంది   
కాలం  !      

మురిపెంగా
మంచుపూలు వెలుగుతాయి  
మొక్కలస్తంభాలకు 

పిట్టమొగ్గలేసి   
గడ్డకట్టిన చెట్టుకు
వాలిన 
పొగమంచు తుట్టె   
చితికి    
ఒక్కొక్కబొట్టు   
భూమి నాలిక తడ్పుతుంది  
తేనెచుక్కలా   

చలి గుర్తులన్నీ   
హత్తుకొని   
నులివెచ్చని శ్వాసల వాయుపాతాలై   
మనిషి ప్రవహిస్తాడు  

ఇనుము స్రవించే ధ్వనుల్లా   
ధ్వనిస్తుంది శరీరం  
చలితరంగాల్ని     

యుద్ధం చేస్తుంటాడొక్కడే 
చలితో !   
వృద్ధాప్యం చేతుల సృజనలోంచి    
ప్త్రైవేటు సూరీడు.   

click me!