రేపు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా సిద్ధాంత వ్యాసం పుస్తక ఆవిష్కరణ

Siva Kodati |  
Published : Dec 26, 2021, 03:45 PM IST
రేపు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా సిద్ధాంత వ్యాసం పుస్తక ఆవిష్కరణ

సారాంశం

వేణుముద్దల నరసింహారెడ్డి సిద్ధాంత వ్యాసం " పాలకురికి సోమనాథుని కృతులు - పరిశీలన " పుస్తక ఆవిష్కరణ సభ రేపు  (27 డిసెంబర్ 2021) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరుగుతుంది.  తెలంగాణ జాగృతి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత ఈ పుస్తకాన్ని  ఆవిష్కరిస్తారు.

వేణుముద్దల నరసింహారెడ్డి సిద్ధాంత వ్యాసం " పాలకురికి సోమనాథుని కృతులు - పరిశీలన " పుస్తక ఆవిష్కరణ సభ రేపు  (27 డిసెంబర్ 2021) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరుగుతుంది.  తెలంగాణ జాగృతి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత ఈ పుస్తకాన్ని  ఆవిష్కరిస్తారు.  తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి  దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సభకు గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ కవి గిరిజా మనోహర్ బాబు, ప్రముఖ నవలా రచయిత  అంపశయ్య నవీన్, సుధీర్ రెడ్డి పాల్గొంటారు. నిర్వహణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం