పుస్తక సమీక్ష: ఇంద్రధనుస్సు రంగులు అద్దితే...

By telugu team  |  First Published Nov 4, 2019, 1:45 PM IST

డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి కవిత్వం మూల మలుపుపై ఉషా రాణి సమీక్ష చేశారు. ఇంద్రధనుస్సు రంగులు అద్దితే మూల మలుపు అవుతుందని ఆమె ముగింపు వాక్యంగా చెప్పారు.


ఊరిమలుపులో నిలబడి  మనసును ఆవిష్కరిస్తే అది ఇంద్రధనస్సులా అనేక వర్ణాలుగా ప్రతిబింబించి అసలు దారిని తేటతెల్లం చేస్తుంది.90వ దశకంనుండి వీరి నిరంతర కవితా వ్రయాణం సాగుతనే వుంది.పొలంలోకి  కొత్తనీరు వదిలినప్పుడు భూమిలోకి ఇంకుతూ,పొడిమట్టిని తడుపుకుంటా ఒరుసుకుంటా,మట్టి పరిమళాలను అద్దుకుంటా పరుగుపెట్టినట్టు  ఈ కవిత్వ ప్రవాహం సాగుతుంది.

భావ చిత్రాలను అల్లడంలో నేర్పరితనం మనకు"జలదృశ్యం"కవితలో కనిపిస్తుంది 
ఇందులో భావచిత్రాలన్నీ ఎంతగా ఇమిడిపోతాయంటే ఆ దృశ్యాలన్ని మనకళ్ళముందు నిలబెడతాయి..."మైసమ్మను నెత్తినమోస్తూ
నిరంతరం కూర్చుండుపోయేది కట్ట."....ఈకవితలో మనలను ఊరి కట్టకాడికి తీసుకొని పొయ్యి అక్కడ నిలబెడుతుంది.ఎంతటి వాళ్ళైనా ఈ ఎత్తుగడలో వున్న భావచిత్రంలో మునిగి వుండాల్సిందే.

Latest Videos

undefined

Also Read: పుస్తక సమీక్ష: వెలుగు కలల పాట.

"కాలానికి వారధికట్టి
తెరుచుకుంటూ మూసుకుంటూ
పంటకు ప్రాణంపోసేది తూము."అంటూ భావత్మక భావ చిత్రాన్ని మనకు చూపిస్తారు.
"నీటి అద్దంమీద కొంగలు
సింగారించుకునే దృశ్యం"నీటిఅద్దంలో కొంగలు తమ ప్రతిబింబాలను చూసుకుంటున్నాయంట.ఒకగొప్ప భావచిత్రాన్ని నిట్టనిలువుగా నిలబెట్టినట్టే వుంటుంది.

"లంగరేసిన ఓడ జెండాలా
గాలికి ఎదురీదే చెట్ల సమూహం"ప్రకృతి అంతటినీ ఒకదృశ్యం చేసి కాపురాజయ్య  పెయింటింగ్ లా  సాక్షాత్కరిస్తుంది."జీవనం శికస్తుకాకముందు
ఇక్కడొక నాకలోకపు నఖలుండేది."అంటూ మనకు ప్రశ్నను వేయడంలో మనం ఎంత అందాన్ని ఎంతకోల్పోతున్నాం అనేముగింపు ఆలోచన తొవ్వలొ నిలబెడుతుందీ 
"కేజ్రీపూల పరిమళం"లో"రంగువెలిసి చారిగిలబడిన పిట్టగోడల సందుల్లోంచి,అతను నడుస్తున్నాడు

"నల్లని తారుదాటి,
మట్టిరోడ్డెక్కి మరీ నడుస్తున్నాడు."ఈకవితలో అతని ప్రయాణం ఎటు?ఎవరివైపు అతనిచూపు అనేది,ఎటువంటి కలల్ని కంటున్నాడు,అనేది మనకు మొదటి రెండు లైన్లలోనే మనకు చూపుతారు వీరి  కవిత్వంలో ప్రత్యేకత కూడాఅదే,ఏవస్తువునైనా,ఏలాంటి క్లిష్టమైన విషయాన్నైనా ఒకదృశ్యం చేసి,ఆ దృశ్యాన్ని మన కళ్ళకు కడతారు    ప్రతినాలుగు లైన్లకీ దృశ్యాన్నిమార్చి వస్తువును నడిపించే ప్రత్యేక శైలి  వీరిది.బాల్యం గురించి అనేకమందిరాసినా కొత్త ప్రతీకలతో ఈబాల్యం కవితను అల్లినతీరు విభిన్నంగా వున్నది."వాడు మేలుకుంటే వెలుగు.

Also Read: ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"

వాడు నిద్రిస్తే వెన్నెల
వాడినవ్వు వెలగకపోతే
ఇంటిలోకమంతా చీకటి.
అంటూ ఇంట్లో పసిపిల్లలతో ఎంత ఆనందంగా ఉంటుందో వివరిస్తాడు కవి.ఎంతటి అజ్ఞానులైనా,ప్రపంచాన్ని గెలిచిన విజ్ఞానులైనా పసితనపు బోసినవ్వులకో,నిశ్శబ్ద నిద్రలో వారికనురెప్పలపై తచ్చాడే లేత వెన్నెలకో అలవోకగా బందీ అయి సేదదీరతారు.

"నిద్రనవ్వు"కవితలో మనసు ఎప్పటికీ పసితనాన్ని సంతరించుకున్నదే...

"పెదవులు సాగదీసి
ఇంటినిండా వెలుగుల్ని పుక్కిలిస్తాడు...
"ఊహల పిట్టలకు రెక్కలొచ్చి
పరుగుతో కాలువ ఉపరితలాన్ని కదిలించి మురిసినట్లు"ఇక్కడ మీబాల్యం మిమ్మల్ని పలకరిస్తుంది.ఈముగింపులో "ష్...సడి చేయకండి
కలల మూటల్ని నిద్రనదిలో జారవిడిచే ప్రమాదముంది." వారి కవిత్వానికి ఆ మహత్తు వుంది.ఒక నిద్రలో నవ్వుకు ఇన్ని దృశ్యాలను పొదగడం వారి విశేషమైన కవితాత్మకు అద్దం పడుతుంది.ఈకవిత చదువుతున్నప్పుడు నందిని సిధారెడ్డిగారి పదాలు కదలాడతాయి.

"ఆ పిల్ల నవ్వితే
నక్షిత్రాలు ఆగుతయి.
ఏడిస్తే జలపాతాలు దిగుతయి..."
అంటారు. నందిని సిధారెడ్డి గారు.అంతె మురిపెంగా నర్సింహారెడ్డి గారి పదాలు కవిత నిండా పరుచుకున్నయి.

"అవతలి తీరం" కవితలో నడిచొచ్చిన నేలలో తిరుగుతున్నాను.పాట జారిపోయిన వేదికమీద 
స్వరాల్ని ఏరుకుంటున్నాను."
"రెప్పదాటిన కలలమీద
మెరుపుల్ని చిత్రిక పడుతున్నాను."అంటూ ఒక ఆశావాహ ధృక్పధాన్ని, చివరలో కొంత  తాత్వికతనూ మేళవించి కవితను నడిపారు.చారిత్రిక విషయాన్ని కవిత్వం చేయడం నర్సింహారెడ్డి కవిత్వంలో తరుచూ మనకు కనిపిస్తుంద ిహైదరాబాద్ విలీనం సంఘటన ఆధారంగా రాసినకవిత.
ఒకనిజం తెలిసింది

Also Read: ముగింపులేని వాక్యం"గా కొనసాగుతున్న కాసుల రవికుమార్ కవిత్వం.

చక్కని దక్కని కోసమేకాదు
హస్తిన విస్తరణ కోసం
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు
జరిగిందినిజం అంటూ విలీనంలోని కుట్రను తేటతెల్లం చేస్తారు.కవికి చరిత్ర పట్ల మక్కువకూడా ఉన్నది."హైదరాబాద్ విశాదం" పేరున తెలుగులోకి "మీర్ లాయక్ అలి"పుస్తకాన్ని గతం లో అనువాదం కూడా చేశారు.  ఒకచారిత్రక సంఘటన అధ్యయానుభవం వల్ల ఈ కవితకు నిండుదనం వచ్చినట్టయింది ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం జరిగిన పోరాటంలో అనేకమంది తెలంగాణా కవులు తమకలాలను పదునుపెట్టారు.వివక్షను ప్రశ్నించడంతో మొదలైన గొంతులు అదే సమయంలో తెలంగాణాలోని ప్రత్యేకమైన భాషని,సాంప్రదాయాలని,కళలని ప్రపంచానికి చాటడంతో పాటుగా అంతర్గత వలసపాలనను ప్రశ్నించడమే కాకుండా సామ్రాజ్యవాద దళారితనాన్ని ప్రశ్నించి ఒక విసృతమైన ప్రాపంచిక దృక్పధాన్ని ఇక్కడి కవులు నెలకొల్పారు.అలా సాధించుకున్న విజయాన్ని పదిలపరుచుకోవాలని నర్సింహారెడ్డిగారు హెచ్చరిస్తున్నారు.
"బోర్లాపడితే నవ్వుదామని జరగని పనుల్లో రంధ్రాలు వెతుకుతుంటారు.

రాష్ట్రమే బెకార్ అని
కనిపించని ట్యాగ్ లైన్ జోడిస్తరు.
పారాహుషార్....అంటూ జాగురతతో కూడిన హెచ్చరికనొకదాన్ని జారీ చేస్తున్నాడు. 
"పరిణతతో
కుట్రల్ని ఛేధించాలనే నేర్పరితనాన్ని బొధిస్తున్నాడు.సాధించుకున్న దాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో పారాహుషార్ అనే కవిత ద్వారా వివరిస్తారు.అరుదుగా "నాన్న"ను కవిత్వంలో ప్రతిష్టించే విధానం ఉన్నది.చాలామంది కవులు"అమ్మ"గురించి రాస్తారు.దాదాపుగా ఏదోసందర్భంలో ప్రతీ కవి  అమ్మగురించి రాసేఉంటాడు, కాని నాన్నగురించి రాసిన అరుదైన జాబితాలో ఏనుగు నర్సింహారెడ్డి ఉంటారు.

"అన్నిచోట్లా దేవుడు ఉండలేక
అమ్మను సృష్టించినట్లు
అమ్మకు శక్తినీయమని
నాన్నను పంపించాడు" నాన్నగురించిన ఈ కొత్తవ్యక్తీకరణని కవి అలవోకగా అల్లేశాడు.నాన్నను గంభిరంగా ఉండే,అన్నింటిని దాచుకొని మౌనంగాతిరిగే, గుంభనమైన ప్రతీకలని ఇంతవరకూమనం తెలుగు కవిత్వంలో అక్కడక్కడాచూశాం.కాని అమ్మకు శక్తినీయడానికి నాన్నను పంపించాడనే ఈ ఆవగాహన క్రొత్తగా ఉన్నది.ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ రాసిన కవిత"చివరిభోజనం"ఉరిశిక్ష ఖాయమైనవారిపట్ల సానుభూతిని ప్రకటిస్తూ ఉరిశిక్ష సరైందికాదని చెప్పే ఈకవితలో పదాలు కవితాత్మకంగాను, సానుభూతిని నింపుకున్నదిగానూ ఉన్నమాటనిజమే అయినా సమాజంలో భయంకరమైన నేరాలు చేస్తూ మానవజాతికే మాయని మచ్చలా ఏర్పడ్డ,క్యాన్సర్ గా మారిన మానవ సమాజంలోని మృగాలను ఏంచేయాలి.

"ఉరి నేరంకన్నా
వికృత ఘోరం"అంటాడు కవి.కాని వికృతమైననేరం ఎంతఘోరం.ఒక అసిఫా,ఒక నిర్భయలపట్ల, ఇంకా అనేకమైన ఈఘోరాలను చేసిన మృగాలను ఏంచేయాలి? స్ర్తీలపట్ల,పసిపిల్లలపట్ల అమానుష చర్యలకుదిగే తోడేళ్ళను ఏంచేయాలి?
వీచే గాలిలో
అప్పుడప్పుడూ అంతుచిక్కని
విషవాయువులు దొర్లినమాట నిజమేకాని,వెంటనే ఆ విషవాయువులను వాతావరణంనుండి అంతంచేయకపోతే,మొత్తానికి వాతావరణమే విషప్రాయమై మానవజాతిని అంతంచేస్తుంది.అందుకే ఆ విషవాయువులు సమాజాన్ని అంతం చేయకముందే విషవాయువుల్ని అంతంచేయడం తప్పనిసరి అవుతుంది."చెక్కడం" కవితలో చెక్కడమంటే అని మొదలు పెట్టి, కవిత్వాన్ని రాయడం ఎలాఅనే విషయాన్ని ఒక శిల్పంలాంటి కవితలో  చూపించారు.ఈనాడు కవులు రాసే కపిత్వానికి సున్నితమైన చురకలా వుంటుంది.ఈ సంధర్భంలో "తిలక్ " పదాలతోపాటు నేటి అక్షరాల పొదరిల్లు,మెత్తని మాటల మాంత్రికుడు "ఆశారాజు"ను కూడా చెప్పడం ..."చెక్కు "చెదరని కవిత్వాన్ని చెక్కాలి 
చిరకాలం గుర్తుండే వాక్యాలను పోతపోయాలి."అనే ముగింపు వాక్యం కవిత్వంపట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.ఇందులో అన్ని కవితలు ఒక్కొక్క గంధపుచెక్క నగిషీలకు ఇంద్రధనస్సు రంగులను అద్దితే అది...."మూల మలుపు"

- సిహెచ్.ఉషారాణి

click me!