డా. తిరునగరి శ్రీనివాస్ హైకూలు : పద చిత్రాలు...

Published : Oct 09, 2023, 08:34 AM IST
డా. తిరునగరి శ్రీనివాస్ హైకూలు : పద చిత్రాలు...

సారాంశం

డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన ఆసక్తికరమైన కొన్ని హైకూలు ఇక్కడ చదవండి : 

కాలం పేజీలు
వెనక్కి తిరిగాయి
జీవిత సమీక్ష జరిగింది
*
పిల్ల కాలువై సాగింది
వరదై ఉరకలెత్తింది
కవిత్వం నైజమే అది
*
ఆద్యంతం ఆత్మవిశ్వాసం
పనితనం సుప్రసిద్దం
మానేతన్న చీరే బంగారం
*
కసితో పూలను కోయకు
పరిమళాల్ని తరిమి కొట్టకు
వికృత సమాధుల్ని మిగల్చకు
*
వాలి పక్షులు వెళ్లిపోయాయి
నీడ  నివ్వాలన్న నిబద్ధతతో
ఒంటరిగా మిగిలాయి చెట్లు

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం