సాహితీ వార్తలు: అవార్డులూ ఆవిష్కరణలు

By telugu news teamFirst Published Aug 27, 2022, 11:46 AM IST
Highlights

కవిత, విమర్శనా గ్రంధాల ఆవిష్కరణ, అవార్డు ప్రదాన సమావేశాలు ఆదివారం జరగనున్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

దీపముండగానే పుస్తక ఆవిష్కరణ సభ : 

త్రివేణీ సాహితీ సంఘం మరియు యాదాద్రి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో గజ్జెల రామకృష్ణ కవితా సంపుటి ' దీపముండగానే ' ఆవిష్కరణ రేపు అనగా 28/08/2022 ఉదయం గం. 10.30 లకు యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి లోని పోచంపల్లి చేనేత డై హౌస్,  కవి కైరంకొండ నర్సింహులు కళా వేదిక మీద జరుగనుంది.  

ఈ సభకు అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య, పుస్తక ఆవిష్కర్త అందెశ్రీ,  ముఖ్య అతిథి జయధీర్ తిరుమలరావు, విశిష్ట అతిథులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, గూడూరు మనోజ, గౌరవ అతిథులు తడ్క యాదగిరి, కొంగరి కృష్ణ.  

డాక్టర్ నాళేశ్వరం శంకరం, తెలిదేవర భానుమూర్తి ప్రధాన వక్తలుగా కొనసాగే ఈ సభానంతరం దాసోజు లలిత సభాధ్యక్షతన మునాసు వెంకట్, బండారు జయశ్రీ ముఖ్య అతిథులుగా, భోగ బాలసుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా కవి సమ్మేళనం ఉంది.


సాహితీ మాణిక్యం పురస్కార ప్రదాన సభ

రావులపాటి నారాయణ - మాణిక్యం స్మారక పురస్కార కమిటీ, ఖమ్మం వారు సాహితీ మాణిక్యం పురస్కారాలను రేపు అనగా 28/08/2022  సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం,  దొడ్డి కొమురయ్య హాల్ లో ప్రదానం చేస్తున్నారు.  కవి యాకూబ్ ఆహ్వానం పలుకుతున్న ఈ సభకు అధ్యక్షులు  జూలూరి గౌరీశంకర్.  మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న ఈ సభలో 2020 సంవత్సరానికి ఆకెళ్ళ రవిప్రకాష్,  డాక్టర్ షాజహానాకు, 2021 సంవత్సరానికి జూపాక సుభద్ర, వనపట్ల సుబ్బయ్యకు ప్రదానం చేస్తున్నారు.

శిఖామణి, డాక్టర్ ఎస్. రఘు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ పసునూరి రవీందర్, వంశీకృష్ణ, ఆనందాచారి ఈ సభకు ఆత్మీయ అతిథులు.  ఈ పురస్కార కమిటీ సభ్యులు ఖాదర్ మొహియుద్దీన్, ప్రసేన్, మువ్వా శ్రీనివాస రావు, పి. రవిమారుత్.


కాంచనపల్లి " తరాజు " ఆవిష్కరణ :

పీచర సునీతారావు ‌మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన రాజు రచించిన " తరాజు " విమర్శనాగ్రంథావిష్కరణ రేపు అనగా 28/08/2022 ఉదయం గం10.30లకు రవీంద్ర భారతి మినీ హాలులో సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతుంది. 

పీచర సునీతారావు ‌మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ పి. విజయేందర్ రావు ఆహ్వానం పలుకుతున్న ఈ సభలో
సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.  ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసే ఈ సభకు విశిష్ట అతిథులు డాక్టర్ మామిడి హరికృష్ణ, దేవకీదేవి.  ప్రత్యేక అతిథులు డాక్టర్ ఎస్. రఘు, డాక్టర్ బాణాల శ్రీనివాస్ రావు.

click me!