సంధ్య సుత్రావె కవిత : ఇష్టం వర్సెస్ కష్టం

By Siva Kodati  |  First Published Aug 20, 2022, 2:07 PM IST

భావి తర నిర్మాణానికి  కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవాలంటూ సంధ్య సుత్రావె రాసిన కవిత "ఇష్టం వర్సెస్ కష్టం " ఇక్కడ చదవండి :


మాట ఇవ్వటం ఇష్టం 
ఇచ్చింది పాటించటం కష్టం 
సాధిస్తాననే నమ్మకం కలిగి ఉండటం ఇష్టం 
ఆ సాధన మార్గం అతి కష్టం 
బంధాన్ని కలిగి ఉండటం ఇష్టం 
బంధాల్ని నిలుపు కోవటం కష్టం 
విత్తు విత్తటం ఇష్టం 
దాన్ని కాపాడి మొలకెత్తించటం కష్టం 
ఇతరుల తప్పులెంచటం ఇష్టం 
తన తప్పులు తెలుసుకోవటం కష్టం 
పంచభక్ష్య పరమన్నాలు తినటం ఇష్టం 
దాన్ని అరగించు కోవటం కష్టం 
వర్షం చూడటం ఇష్టం 
ఆ వర్షాన్ని భూమిలోకి ఇంకించటం కష్టం 
ఆరోగ్యంగా ఉండాలనుకోవటం ఇష్టం 
దాన్ని కాపాడుకోవటం కష్టం 
వ్యాయామం చేయాలనుకోవటం ఇష్టం 
కానీ చేయాలంటేనే  కష్టం 
ఆతిథ్యం పుచ్చుకోవటం ఇష్టం 
తిరిగి ఇవ్వటం కష్టం 
కొనుగోలు చేయటం ఇష్టం 
వాటిని సజావుగా వాడుకోవటం కష్టం 
డబ్బు సంపాదించటం ఇష్టం 
సరయిన మార్గంలో ఖర్చు చేయటం కష్టం 
సంతానం కలిగి ఉండటం ఇష్టం 
వారిని మంచి క్రమశిక్షణలో పెంచటం కష్టం 
మిత్ర బృందంతో ఉండి హితబోధనలు చేయటం ఇష్టం
ఎంత బాధ అయినసరే ఇష్టంగా పాటిస్తూ
సన్మార్గంలో నడవడమే కష్టం 
కానీ భావి తర నిర్మాణానికి 
కష్టాన్ని ఇష్టంగా మలుచుకొంటే
అదే కష్టం వర్సెస్ ఇష్టం.
 

click me!