తెలుగు సాహిత్యం: దసరా కథల పోటీలు

By telugu teamFirst Published Jul 31, 2020, 4:22 PM IST
Highlights

రెండు తెలుగు సంస్థలు తెలుగు కథా పోటీలను నిర్వహిస్తున్నాయి. పాలపిట్ట - జైనీ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా పర్వదినం సందర్బంగా తెలుగు కథల పోటీలను నిర్వహిస్తున్నాయి.

ద‌స‌రా క‌థ‌ల పోటీ

ద‌స‌రా సంద‌ర్భంగా పాల‌పిట్ట‌-జైనీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో - ద‌స‌రా క‌థ‌ల పోటీ- నిర్వ‌హిస్తున్నాం. మొద‌టి బ‌హుమ‌తి- రూ. 10,000, రెండో బ‌హుమ‌తి- రూ. 5000, మూడో బ‌హుమ‌తి- 3000. ఒక్కొక్క క‌థ‌కు వెయ్యి రూపాయ‌ల చొప్పున ప‌ది క‌థ‌ల‌కు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు అంద‌జేస్తాం. క‌థ‌ల‌కు పేజీల నిడివి లేదు. ఎన్ని పేజీల‌యినా, ఎన్ని ప‌దాల‌యినా ఉండొచ్చు. ఇతివృత్తం ర‌చ‌యిత‌ల యిష్టం. ఎలాంటి ష‌ర‌తులు లేవు. క‌థ క‌థ‌గా ఉండ‌ట‌మే ప్ర‌ధానం. తెలుగు క‌థ‌కులు ఎక్క‌డి వార‌యినా ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చు.

క‌థ‌లు పంప‌డానికి చివ‌రి తేదీ 15 ఆగ‌స్టు 2020. క‌థ‌ల‌ను ఈమెయిల్‌లోనూ, పోస్టులోనూ పంప‌వ‌చ్చు.  
చిరునామాః ఎడిట‌ర్‌, పాల‌పిట్ట, 16-11-20/6/1/1, 403, విజ‌య‌సాయి రెసిడెన్సీ, స‌లీంన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట‌, హైద‌రాబాద్‌-500 036, ఫోనుః 9848787284

 Email: palapittamag@gmail.com
palapittabooks@gmail.com

జీవన జ్వలిత సాహిత్య సాంస్కృతిక వేదిక - బహుజన సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ

1. చేతివృత్తుల కథలు
2. బీసీరచయితల కథలు
3. బహుజన కథలు(బహుజన అస్తిత్వం)
ఈ మూడు కథలలో పోటీ నిర్వహిస్తున్నారు.

కథలను అనుభవజ్ఞులైన కథకులు న్యాయనిర్ణేతలుగా ప్రతివిభాగంలో మూడు బహుమతులను ప్రకటిస్తారు
మొదటి బహుమతి రూ.3000లు
రెండవ బహుమతి. రూ.2000లు
మూడవ బహుమతి రూ.1000లు
(మంచి కథలు సూచించిన వారికి బహుమతులు ఉంటాయి, ఈ మూడు కథల పుస్తకాలు అచ్చు వేయబడతాయి)
గతంలో అచ్చయిన కథలను కూడా పంపవచ్చు అయితే ఎందులో, ఎప్పుడు అచ్చయినది సమాచారం ఇవ్వాలి.
పంపే కథలకు ఏ విభాగం అన్నది పైన రాయాలి.

మీ కథలు యూనికోడ్ ఫైల్ , పిడిఎఫ్ ఫైల్ రెండూ పంపాలి, కథతో పాటు మీ స్వంత రచనే అనే హామీ పత్రం , చిరునామా, ఫోన్ నంబర్ , ఈమైల్ ఐడితో పాటు , పాస్పోర్ట్ సైజ్ ఫొటో పంపాలి.
చివరి తేది.30-09-2020
పంపవలసిన mail. ID.
kathalujaladhi@gmail.com
devaki.tirunagari@gmail.com
9989198943,
9949636515
83747 93374

click me!