వనపట్ల సుబ్బయ్య దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ

Published : Apr 12, 2023, 04:34 PM IST
 వనపట్ల సుబ్బయ్య  దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ

సారాంశం

అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా  వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ వివరాలు ఇక్కడ చూడండి. 

వనపట్ల సుబ్బయ్య రాసిన దీర్ఘ కవిత ' మా అక్షరం, ఆయుధం అంబేద్కర్ ' ఆవిష్కరణ సభ రేపు అనగా గురువారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ లోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరగనుంది. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రాసిన ఈ కవితా సంపుటిని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరిస్తారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆత్మీయ అతిధులుగా డా. మామిడి హరికృష్ణ, డా. సంగిశెట్టి శ్రీనివాస్, డా. కోయి కోటేశ్వరరావులు పాల్గొంటారు. నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక, నాగర్ కర్నూల్  వారు ఈ సభా కార్యక్రమాలను సమన్వయం చేస్తారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం