రూప్ కుమార్ డబ్బీకార్ కవిత : ఆసరా

Published : Jan 11, 2023, 10:55 AM IST
రూప్ కుమార్ డబ్బీకార్ కవిత :  ఆసరా

సారాంశం

ఆకుపచ్చని కలలు జారి పోకుండా జాగ్రత్త పడాలి అంటూ రూప్ కుమార్ డబ్బీకార్ రాసిన కవిత  "  ఆసరా " ఇక్కడ చదవండి:

ఎండు కొమ్మ పైన వసంతం చిగురించాల్సిందే
శిశిరాలపై తిరిగి పచ్చదనపు బాల్యం పొడసూపడం
ఆనందదాయకమే కదా
జీవితం ప్రకృతిలో ఒక అంశ ఐనపుడు
ఆరు రుతువులు దేహంపై ఆడుతూనే వుంటాయి
పొగచూరు వాసనతో వచ్చే కలలతో మనకేం పని -
పరిమళించే రుతువుల సహజత్వాలు 
మన జవసత్వాలు కావాలి
భుజం గుమ్మి ఎప్పుడూ బరువుతో కుంగిపోయి ఉంటున్నా
కమిలి పోయిన కనురెప్పల మీద నుండి
ఆకుపచ్చని కలలు జారి పోకుండా జాగ్రత్త పడాలి
రుతువులు మాత్రం 
కుంగిపోతున్న భుజాలకు ఆసరాగా ఉంటూనే వుంటాయి.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం