తిరిగి చూసుకోవాలి అనే ధ్యాసే లేదు ప్యాచ్ వర్క్ లు సరి చేసుకోకుంటే పంచర్ కాదా అంటూ దాసరి మోహన్ రాసిన కవిత ' మనిషి కత్తులు కట్టుకుని ' ఇక్కడ చదవండి :
మాటలు రాలుస్తూ వెళుతున్నాడు కఠినంగా
మది ఎవరిదో విలపిస్తుoది మౌనంగా
వినిపించని విభేదాలు పేరుకు పోతున్నాయి
విద్వేషం విధ్వంస పర్వతాలు మనుషుల మద్య
కత్తులు కట్టుకుని తిరుగుతున్నాడు
ఎవరిని గాయ పరుస్తున్నది తెలియడం లేదు
చెప్పుకోలేనంత కనిపెట్టలేనంత బాధ స్రావం
నర నరాన పగా ప్రతీకారాల నదుల ప్రవాహం
శత్రువులు తయారు తెలియకుండానే
దూరం దేవుడు ఎరుగు దగ్గరి వారే కోకొల్లలు
ఎప్పుడు ఎటునుంచి ఉపద్రవం విసురుతారో మరి
కుట్రల మేఘాలు కమ్ముకొని తగిన సమయం కోసం
undefined
తిరిగి చూసుకోవాలి అనే ధ్యాసే లేదు
ప్యాచ్ వర్క్ లు సరి చేసుకోకుంటే పంచర్ కాదా
తీరా బతుకు పేలిపోయాక కూలిపోయాక
జాలి మాత్రమే మిగులు జాము నిశ్శబ్దంగా జారు...