దండమూడి శ్రీచరణ్ కవిత : ఊహు!

Published : Mar 10, 2023, 12:02 PM IST
 దండమూడి శ్రీచరణ్ కవిత : ఊహు!

సారాంశం

ఈ సంచులూ, బీరువాలూ మోసుకుంటూ తిరగడానికి నువ్వేమైనా నత్తవా? అంటూ భువనగిరి నుండి దండమూడి శ్రీచరణ్ కవిత " ఊహు! " ఇక్కడ చదవండి :   

అలా వెళ్లిపోవాలి...అంతే
మూలాల్లోకి
వేరుల చివర్ల వున్న మట్టి రేణువుల్లోకి
మనసు పొరల్లో అట్టడుగున ఆర్ద్రతలోకి
కడలి గర్భాన అణగి వున్న గవ్వలలోకి
అలా...
చెమ్మను గిల్లుకొని,
హత్తుకొని,
పీల్చుకుని
తెప్పరిల్లాలి.
దూకావా?
ఆ ధృవాల అంచు నుండి
ఈ మంచు కొండ శిఖరం పైకి
ఓకే ఒక అంగలో!
ఇంకేం మిగిలుంది ఈ జీవితంలో?
సజావుగా,బల్లపరుపుగా,నత్తలా.......?
అలా కాదుగా!?
నువ్వో కుంచెవో, ఉలివో,
మట్టి కుండను సుతారంగా తీర్చే వేళ్ళ లానో.......
అలాగన్నట్లు!
ఈ సంచులూ,పెట్టెలూ, బీరువాలూ
మోసుకుంటూ తిరగడానికి
నువ్వేమైనా నత్తవా?
బల్లపరుపుగా......!?
ఊహు!!
ఒక్క ఉదుటున...లోతుగా.. ఎత్తుగా..
వేగంగా.. చురుగ్గా అలాగన్నట్లు!!


 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం